విజయవాడ, కాకినాడ వాసులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్‌ చెప్పింది. అత్యాధునిక హంగులతో రూపొందించిన స్లీపర్ బస్సులను ఆర్టీసీ నేటి నుంచి అందుబాటులోకి తీసుకురాబోతుంది. హైదరాబాద్‌-కాకినాడ, హైదరాబాద్‌-విజయవాడ మార్గాల్లో అద్దె ప్రతిపాదికన ఈ బస్సులను ఆర్టీసీ యాజమాన్యం నడపుతోంది. హైదరాబాద్‌ కేపీహెచ్‌బీ కాలనీ బస్టాప్ దగ్గర ఇవాళ సాయంత్రం 4 గంటలకు జరిగే కార్యక్రమంలో సంస్థ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్దన్‌, ఎండీ వీసీ సజ్జనర్‌ ఈ కొత్త బస్సులను ప్రారంభిస్తారు.


ఈ స్లీపర్ బస్సుల్లో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. స్లీపర్‌ బస్సుల్లో లోయర్‌ బెర్తులు 15, అప్పర్‌ బెర్తులు 15 వరకు ఉంటాయి. ప్రతి బెర్త్‌ వద్ద మొబైల్‌ చార్జింగ్‌ సౌకర్యం ఉంటుంది. ప్రతి బస్సుకు ఎయిర్‌ సస్పెన్షన్‌ సదుపాయం ఉంటుంది. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రతి బస్సులోనూ వైఫై సదుపాయాన్ని కల్పించారు. లగేజీ లోడింగ్‌, అన్‌లోడింగ్‌కు అటెండెంట్లు సహకరిస్తారు. బస్సుకు ముందు వెనక ఎల్‌ఈడీ బోర్డులుంటాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: