జీవో 317 జీవో కు వ్యతిరేకంగా టీచర్లు పోరాడుతున్నారు. టీచర్ల బదిలీలకు సంబంధించిన ఈ జీవో ఇప్పుడు కేసీఆర్‌కు తలనొప్పగా మారుతోంది. టీచర్లకు మద్దతుగా... హైదరాబాద్ లక్డికపుల్ లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయాన్ని తాజాగా భాజపా మైనార్టీ మోర్చా నాయకులు కూడా ముట్టడించారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపు మేరకు... కార్యాలయం గేటు ముందు బైఠాయించి  నాయకులు నిరసన తెలిపారు. లోపలికి వెళ్లేందుకు యత్నించడంతో మైనార్టీ మోర్చా నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు.. నాంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు.


317 జీవో ను రాత్రికి రాత్రే విడుదల చేసిన అమలు చేశారని... ప్రభుత్వ చర్యల వల్ల ఇప్పటివరకు 30 మంది ఉపాధ్యాయులు అతహత్యాలు చేసుకున్నారని టీచర్లు తెలిపారు. 317జీవో పై రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరికి మార్చుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని టీచర్లు హెచ్చరించారు. అక్రమ అరెస్ట్ లకు నిరసన పోలీస్ స్టేషన్ లో మైనార్టీ మోర్చా నాయకులు ఆందోళన కొనసాగించారు. ఉపాధ్యాయులను బాధపెట్టిన ఏ ప్రభుత్వం మనుగడలో లేదని... భార్య, భర్తలను వేరు చేసి వారి మధ్య మానసిక వేదనను కలిగిస్తున్నారని...నాయకులు ఆరోపించారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

KCR