సికింద్రాబాద్‌ మినిస్టర్ రోడ్‌ ప్రాంతంలో అగ్ని ప్రమాదం కారణంగా దగ్గమైన డెక్కన్‌ స్పోర్ట్స్‌ మాల్‌ భవనం కూల్చి వేత పనులు జోరుగా సాగుతున్నాయి. మల్లిక్‌ ట్రేడింగ్‌ డెమాలిషన్‌ సంస్థ ఈ కూల్చివేత పనులు చేపట్టింది. అయిదంతస్తుల భవనంతో పాటు పెంట్‌ హౌస్‌ ను ఇప్పటికే చాలా వరకు కూల్చి వేశారు. మరో నాలుగైదు రోజుల్లో భవనం మొత్తం కూల్చివేస్తామని సంస్థ ఇంజినీర్లు చెబుతున్నారు. స్థానికుల ఇళ్లకు ఎటువంటి నష్టం జరగకుండా అన్ని జాగ్తత్తలు తీసుకుంటున్నట్టు జీహెచ్‌ఎంసి అధికారులు చెబుతున్నారు.


స్థానికులందరినీ ఇళ్లు ఖాళీ చేయించామని  భవనం పూర్తిగా నేలమట్టం అయ్యే వరకు ఇళ్లలోకి ఎవరూ రావొద్దని ఇప్పటికే జీహెచ్‌ఎంసీ అధికారులు స్పష్టం చేశారు. మీద అంతస్తుల నుంచి భవనాన్ని క్రమక్రమంగా కింద వరకు కూల్చుకుంటు వస్తున్నట్టు జీహెచ్‌ఎంసీ అధికారులు చెప్పారు. శిథిలాలను ర్యాంప్‌ గా ఉపయోగించి వాటిపై భారీ హైడ్రాలిక్‌ వాహనాన్ని ఉంచి జీహెచ్‌ఎంసీ అధికారులు దాని సహాయంలో కూల్చివేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: