కేసీఆర్ ప్రభుత్వం అనేక తప్పులను గవర్నర్ ప్రసంగం ద్వారా చెప్పించారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం అనేది శుధ్ధ తప్పు అన్న ఈటల రాజేందర్.. ఆరు గంటల కరెంట్ రావట్లేదని రైతులు సబ్ స్టేషన్లో వద్ద ఆందోళన చేస్తున్నరని తెలిపారు. రైతులకు 24 గంటల కరెంట్ ఇవ్వట్లేదని సాక్షాత్తు ప్రభాకర్ రావు చెప్పారని.. గవర్నర్ ప్రసంగంలో అనేక అబద్ధాలు ఉన్నాయన్న ఈటల ప్రసంగంలో ధరణి ప్రస్తావన లేదని ఈటల రాజేందర్ మండిపడ్డారు.


ప్రభుత్వం ఇచ్చిన ప్రతీ మాత్రమే గవర్నర్ చదివారన్న ఈటల రాజేందర్.. ధరణీతో అనేక మంది ఇబ్బందులకు గురవుతున్నారని... కేంద్ర నిధులతో మాత్రమే అర్బన్ ప్రాంతంలో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించారని ఈటల రాజేందర్ చెప్పారు. గజ్వేల్ , సిద్దిపేట తప్ప ఎక్కడా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించలేదని.. ధరణీ, డబుల్ బెడ్ ఇళ్లు రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఈటల రాజేందర్ ఆవేదన వ్యక్తంచేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: