ప్రధాని నరేంద్ర మోదీ నయా నియంతగా మారి ప్రజాస్వామ్య వ్యవస్థకు తూట్లు పొడుస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌ రెడ్డి ఆక్షేపించారు. తన మిత్రుల కోసం మోదీ దేశాన్ని కొల్లగొడుతున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీపై అనర్హత వేటును నిరసిస్తూ నిన్న గాంధీభవన్‌లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష చేపట్టారు. ఫిబ్రవరి 7న భాజపా ప్రభుత్వాన్ని నిండు సభలో అదాని కుంభకోణంపై రాహుల్ ఘాటుగా ప్రశ్నించడంతో మోదీ ఉక్కిరిబిక్కిరైన సమాధానం చెప్పలేని పరిస్థితి కనిపించిందని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు.


భాజపా డబుల్ ఇంజన్.. అదానీ, మోదీ అని రేవంత్‌ రెడ్డి ఎద్దేవా చేశారు. రాహుల్‌గాంధీని ఎదుర్కునే ధైర్యం లేక ప్రధాని కుట్ర చేసి అనర్హత వేటు వేశారని.. ప్రజానీకం పక్షాన నిలబడి ప్రజాస్వామ్యాన్ని కాపాడిన గొప్ప చరిత్ర కాంగ్రెస్ పార్టీదని, అలాంటిది హడావుడిగా రాహుల్‌గాంధీని భాజపా సర్కారు అనర్హుడుగా ప్రకటించిందని రేవంత్‌ రెడ్డి విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: