శ్రీరామనవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో. సీతారాంబాగ్ లోని రామాలయం నుంచి కోఠి లోని హనుమాన్ వ్యాయామశాల వరకు శోభా యాత్ర జరుగుతుంది. సీతారాం బాగ్ రామాలయంలో ఉదయం 9 గంటలకు నుంచి శ్రీరాముని కళ్యాణం ప్రారంభమవుతుంది. కళ్యాణ అనంతరం శోభాయాత్ర ప్రారంభమవుతుంది. శోభా యాత్రకు ముఖ్య అతిథులుగా కాశీ నుంచి సుమేరు పీఠాధిపతి శంకరాచార్య స్వామి, నరేంద్ర నంద సరస్వతి, రాజస్థాన్ నుంచి క్రాంతికారి శ్రీసంత్ భోమా రాంజీ హాజరవుతారు.

యాత్ర సీతారాంబాగ్ నుంచి బోయగూడ కమాన్- మంగళహాట్ పీఎస్-పురానా పూల్-సిద్ధంబరు బజార్- గౌలిగూడ- పుత్లిబౌలి-కోఠి ఆంధ్రాబ్యాంక్-బడి చౌడి మీదుగా హనుమాన్ వ్యాయామశాలకు చేరుతుంది. శ్రీరామనవమి శోభాయాత్రకు రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు తరలిరావాలి. అంబర్‌పేట నుంచి, ఫిలింనగర్ నుంచి మరి కొన్ని  శోభాయాత్రలు కోఠి వ్యాయామ శాలకు వస్తాయి.  ఆకాశ్ పురి నుంచి మరో శోభాయాత్ర దూల్పేట కూడలి వద్ద కలుస్తుంది. శాంతియుతంగా ఈ శోభా యాత్ర నిర్వహిస్తారు. శోభాయాత్రకు వచ్చే భక్తులకు దారి పొడవున అన్న పానీయాలు అందుబాటులో ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: