ఏపీలో విద్యుత్‌ ప్రాజెక్టులు జోరుగా రెడీ అవుతున్నాయా.. వీటి ద్వారా లక్షల ఉద్యోగాలు వస్తాయా.. అంటే అవునంటోంది ప్రభుత్వం. విశాఖ సదస్సు ద్వారా 25 విద్యుత్‌ ప్రాజెక్టులకోసం ఒప్పందాలు కుదుర్చుకున్నామని ఏపీ అధికారులు చెబుతున్నారు. ఇందులో 8 ప్రాజెక్టులు ఎస్‌ఐపీబీ ఆమోదం పంపించామని ఏపీ అధికారులు వివరించారు.  మరో 4 ప్రాజెక్టుల్లో పనులు ప్రారంభం కానున్నాయని ఏపీ అధికారులు వివ‌రించారు. ఇవి కాకుండా మరో 8 ప్రాజెక్టుల డీపీఆర్‌లు సిద్ధం అయ్యాయని ఏపీ అధికారులు వివ‌రించారు.


విశాఖ సదస్సు ద్వారా మాత్రమే కాకుండా .. అంతకు మునుపే రాష్ట్ర ప్రభుత్వంతో 20 విద్యుత్‌ ప్రాజెక్టుల కోసం ఒప్పందాలు కుదుర్చుకున్నామని ఏపీ అధికారులు వివరించారు.  అందులో 6 ప్రాజెక్టుల్లో పనులు త్వరలోనే ప్రారంభం అవుతాయన్నారు. 11 డీపీఆర్‌ పూర్తిచేసుకున్నాయని  ఏపీ అధికారులు వెల్లడించారు. ఇలా మొత్తం వీటి ద్వారా 8.85లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయని..  1,29,650 మందికి ఉద్యోగాలు వస్తాయని ఏపీ అధికారులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: