ఏ రాజకీయ పార్టీ నేతల కాళ్లు పట్టుకోవాల్సిన అవసరం వైసీపీకి లేదంటున్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్‌. జగన్‌ పార్టీ స్థాపించిన 2011 నుంచి ఈ రోజు వరకూ ఏ రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం కానీ, ఏ రాజకీయ పార్టీ వారి కాళ్లు పట్టుకోవాల్సిన అవసరం కానీ లేదని మంత్రి గుడివాడ అమర్నాథ్‌ అన్నారు. మేం అధికారంలోకి రావడానికి మీ సహకారం కావాలి అనే పరిస్థితులు ఏ రోజూ వైసీపీకి రావని మంత్రి గుడివాడ అమర్నాథ్‌ అన్నారు.


మీరంతా కలిసి పోటీ చేస్తామంటే చేయండి, సమస్యే లేదన్న మంత్రి గుడివాడ అమర్నాథ్‌.. చంద్రబాబుకి, బీజేపీకి, తోక పార్టీకి బలం లేక తాపత్రయపడి కలిసి పోటీచేయాలని ప్రయత్నం చేస్తున్నారని.. అమర్నాథ్‌ అన్నారు. ఇదే అమిత్‌ షా తిరుపతిలో రాళ్లిసిరిన చంద్రబాబు.. ఈ రోజు పువ్వులిసురుతున్నారని ఎద్దేవా చేశారు. ఇదే అమిత్‌షాను అసెంబ్లీలో నిలబడి చంద్రబాబు మీ సంగతి తేల్చేస్తానన్న చంద్రబాబు వాళ్ళ కాళ్లు పట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందో చెప్పాలన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: