డ్రగ్స్‌ వ్యవహారంలో తన పేరు బయటకు రావడంపై నటి అషు రెడ్డి స్పందించింది. ఈ మేరకు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్టు చేసింది. కొన్ని మీడియా ఛానెళ్లు నన్ను కించపరిచేలా వార్తలు రాశాయని అషు రెడ్డి వాపోయింది. నా ఫోన్‌ నంబర్‌ ప్రసారంతో విపరీతంగా ఫోన్లు వస్తున్నాయన్న అషు రెడ్డి.. దీంతో తాను మానసికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నానంటోంది.

తనను  
కించపరిచేలా వ్యవహరించిన ఛానెల్‌పై పరువు నష్టం దావా వేస్తానని నటి అషు రెడ్డి మండిపడుతోంది. నిర్మాత కేపీ చౌదరితో గంటల కొద్దీ ఫోన్‌ మాట్లాడినట్లు చెబుతున్నారన్న నటి అషు రెడ్డి .. అదంతా అబద్దమంటోంది. కేపీ చౌదరితో పరిచయం, ఫోన్ కాల్స్‌పై తన వద్ద  ఆధారాలు ఉన్నాయని నటి అషు రెడ్డి  తెలిపింది. నాపై ఆరోపణల పట్ల మౌనంగా ఉండలేక ఈ వీడియో పోస్టు చేస్తున్నానంటూ నటి అషు రెడ్డి  వివరణ ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: