తెలంగాణ ఇరిగేషన్ శాఖలో డిప్లొమా ఇంజినీర్ల పదోన్నతులకు హైకోర్టు ఓకే చెప్పింది. అసిస్టెంట్ ఇంజినీర్ నుంచి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ గా పదోన్నతికి ఉన్నత న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. డిప్లొమా విద్యార్హతలతో ఇరిగేషన్ శాఖలో చేరి పదోన్నతిపై అసిస్టెంట్ ఇంజినీర్ గా చేస్తున్న వారిని డీఈఈ గా పదోన్నతి ఇస్తూ ప్రభుత్వం గతేడాది ప్రభుత్వం జీవో 112 జారీ చేసింది. పదకొండేళ్ల సర్వీసు ఉన్న వారికి డీఈఈగా పదోన్నతి ఇచ్చేలా తెలంగాణ ఉత్తర్వులు జారీ చేసింది.

బీటెక్ విద్యార్హతలతో నేరుగా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ గా నియమితులైన అధికారులు హైకోర్టులో ప్రభుత్వ ఉత్తర్వులను సవాల్ చేస్తూ పిటిషన్ వేశారు. సుదీర్ఘ వాదనల తర్వాత ఏఈఈల పిటిషన్లను కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. డిప్లొమా ఏఈలకు పదోన్నతి కల్పించేలా నిబంధనలను సవరించడానికి ప్రభుత్వానికి అధికారం ఉందని ఉన్నత న్యాయస్థానం క్లారిటీ ఇచ్చింది. జీవోను సమర్థిస్తూ ఏఈలకు డీఈఈలుగా పదోన్నతి ఇచ్చేందుకు హైకోర్టు అనుమతించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: