తెలంగాణలో రేపే పోలింగ్.. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల ప్రకటన వెలువడిన అక్టోబర్ తొమ్మిదో తేదీ నుంచి ఇప్పటి వరకు తనిఖీల్లో మొత్తం 724 కోట్ల సొత్తు స్వాధీనం చేసుకున్నారు. అందులో 292 కోట్లు నగదు, 122 కోట్ల విలువైన మద్యం, 39 కోట్ల విలువైన డ్రగ్స్, 186 కోట్ల విలువైన బంగారం, ఇతర ఆభరణాలు, 83 కోట్ల విలువైన ఇతర కానుకలు ఉన్నాయి. ప్రచారపర్వం ముగిసింది. ఇక ప్రలోభాలకు అవకాశం ఉన్నందున వాటి కట్టడిపై యంత్రాంగం దృష్టి సారిస్తోంది.

ఇక తెలంగాణలో 12,311 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అక్కడ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 27,051 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ సదుపాయం ఏర్పాటు చేయనున్నారు. ఒకటికి మించి పోలింగ్ బూత్ లు ఉన్న కేంద్రాల వద్ద బయట కూడా కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: