ఏపీలో ఓ భారీ పరిశ్రమ రాబోతోంది. ఏపీలోని చిత్తూరు జిల్లా పుంగనూరులో రూ. 4,640 కోట్లతో 800 ఎకరాల విస్తీర్ణంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్‌ బస్సు, ట్రక్‌ క్లస్టర్‌ యూనిట్‌ ఏర్పాటు కాబోతోంది. దీన్ని పెప్పర్‌ మోషన్ సంస్థ ఏర్పాటు చేయబోతోంది. దీనికి అతి త్వరలో భూమిపూజ చేయబోతున్నారు. నిన్న సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌ను జర్మనీకి చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్‌ బస్సులు, ట్రక్కుల తయారీ సంస్ధ పెప్పర్‌ మోషన్‌ సీఈవో ఆండ్రియాస్‌ హేగర్ ఈ విషయం తెలిపారు.


గ్రీన్‌ ఎనర్జీకి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, పారిశ్రామిక విధానాలు, సింగిల్‌ విండో అనుమతులు, పారదర్శక విధానాలపై పెప్పర్‌ మోషన్‌ ప్రతినిధులతో సీఎం జగన్ చర్చించారు. ఈ పరిశ్రమకు ఏడాదికి 30,000 ఎలక్ట్రిక్‌ బస్సులు, ట్రక్కులు తయారీ సామర్ధ్యం ఉంది. అలాగే  ఇంటిగ్రేటెడ్‌ వర్టికల్‌ ప్రొడక్షన్‌ ఫెసిలిటీ ఏర్పాటుచేయనున్నారు. 20 జీడబ్ల్యూహెచ్‌ సామర్ధ్యం గల బ్యాటరీల నుంచి ఎలక్ట్రిక్‌ బస్సులు, ట్రక్కుల తయారీ, అంతర్జాతీయ ప్రమాణాలతో యూనిట్‌ ఏర్పాటు చేస్తారు.


మరింత సమాచారం తెలుసుకోండి: