తెలంగాణలో బీఆర్‌ఎస్ సర్కారు ఓడిపోయింది. కేసీఆర్‌ గద్దె దిగిపోయారు. కాంగ్రెస్ హవా వీచింది. 64 స్థానాలు సాధించి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ సాధించింది. అయితే.. ఇక్కడ ఓ తమాషా ఉంది. కాంగ్రెస్‌ గెలిచిన సీట్లకు, సాధించిన ఓట్ల శాతానికి చాలా తేడా ఉంది. అసలు పొంతనే లేదు. అందుబాటులో ఉన్న డేటా ప్రకారం ఓడిన బీఆర్‌ఎస్‌ పార్టీకి 37.36% ఓట్లు వచ్చాయి. గెలిచిన కాంగ్రెస్‌ పార్టీకి 39.39% ఓట్లు వచ్చాయి.


అంటే ఓట్లలో 2% మాత్రమే తేడా ఉంది. ఈ తేడాతోనే  సీట్లలో చాలా వ్యత్యాసానికి కారణమైంది. 2018లో బీఆర్ఎస్‌కు 46.9% ఓట్లు, కాంగ్రెస్ 28.4% ఓట్లు వచ్చాయి. 2018తో పోల్చి చూస్తే.. అప్పుడు గెలిచిన, ఓడిన పార్టీల మధ్య దాదాపు 18-19 శాతం తేడా ఉంది. కానీ ఇప్పుడు కేవలం రెండు శాతం ఓట్ల తేడాతోనే అధికారం మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

kcr