సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. రెండు గ్యారంటీలను అధికారంలోకి వచ్చి.. సీఎంగా ప్రమాణం చేసిన రెండు రోజుల్లోనే అమలు చేసి చూపించారు. మహాలక్ష్మి ఉచిత ప్రయాణం పథకం, ఆరోగ్యశ్రీ పది లక్షల రూపాయల పథకాలను ఇవాళ ఆయన స్వయంగా ప్రారంభించారు. ఈరోజు తెలంగాణ ప్రజలకు పండగరోజన్న సీఎం రేవంత్ రెడ్డి.. 2009, డిసెంబర్ 9న తెలంగాణ ప్రక్రియ ప్రారంభమైందని గుర్తు చేసుకున్నారు.


తెలంగాణ తల్లి అంటే సోనియమ్మ రూపం కనిపిస్తుందని.. నాది తెలంగాణ అని చెప్పుకునే అవకాశం మనకు సోనియమ్మ ఇచ్చారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజల కోసం సోనియమ్మ ఆరు గ్యారంటీలను ఇచ్చారన్న సీఎం రేవంత్ రెడ్డి.. ఇవాళ ఆరు గ్యారంటీలలో రెండు గ్యారంటీలను అమలు చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుందన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10లక్షల వరకు ప్రజలకు ఉచిత వైద్యం అందిస్తామని.. మహిళలు ఈరోజు నుంచి రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణను సంక్షేమ రాజ్యంగా మారుస్తామన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: