హైదరాబాద్‌ బేగంపేట్ లోని ఓ హోటల్ లో.. తెలంగాణ జనసమితి అధ్యక్షులు ప్రోఫెసర్ కోదండరామ్ డిప్యూటీ కలెక్టర్ల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. గత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రాష్ట్రంలో అనేక రంగాల్లోని సమస్యలు పెండింగ్ లో ఉన్నాయని తెలంగాణ జనసమితి అధ్యక్షులు ప్రోఫెసర్ కోదండరామ్ వారితో అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం తమకు ఎం లాభం అని లెక్కలు వేసుకుని పనులు చేశారే పేద ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయలేదని తెలంగాణ జనసమితి అధ్యక్షులు ప్రోఫెసర్ కోదండరామ్ ఆరోపించారు.


గత ముఖ్యమంత్రిని కలిసే అవకాశం లేదని.. వాస్తవంగా దోషులు ఎవరో చెప్పాల్సిన అవసరం తమపై ఉందని ప్రోఫెసర్ కోదండరామ్ వెల్లడించారు. రాష్ట్రంలో అనేక భూ సమస్యలు ఉన్నాయన్న ప్రోఫెసర్ కోదండరామ్ రాబోయే కాలంలో ప్రజలకు, ప్రభుత్వానికి అనుసంధానంగా ఉంటూ తగిన సూచనలు, సలహాలు ఇస్తామని డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు లచ్చిరెడ్డి అన్నారు. రెవెన్యూ శాఖలో పూర్వ వైభవం రావాలని కోరుకుంటామని... నూతన ఒరవడి వస్తుందని అన్నారు. గ్రామాల భూములు సమస్యలు పరిష్కారం చేయడమే తమ లక్ష్యమన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: