సమ్మె విరమించి విధులకు హాజరు కావాలని అంగన్వాడిలకు మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి విజ్ఞప్తి చేశారు. ఆందోళన విరమించాలని మంత్రి బొత్స సత్యనారాయణ కోరారు. చాలా జిల్లాల్లో అంగన్‌వాడీలు విధులకు హాజరవుతున్నారని.. విధుల్లోకి చేరుతున్న వారందరికీ ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నానని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మిగిలిపోయిన వారు కూడా వెంటనే విధులకు హాజరుకావాలని కోరుతున్నానన్న మంత్రి బొత్స సత్యనారాయణ.. అధికారంలోకి రాగానే జీతాలు పెంచామని.. అంగన్వాడి లు కోరకపోయినా అనేక సౌకర్యాలు, సదుపాయాలు కల్పించామని గుర్తు చేశారు.

ప్రస్తుతం ఆందోళన సమయంలో కూడా అనేక డిమాండ్లను అంగీకరించామన్న  మంత్రి బొత్స సత్యనారాయణ.. వాటిని అమల్లోకి తెచ్చేలా ప్రభుత్వం తరఫున ఉత్తర్వులు కూడా జారీచేశామన్నారు. మిగిలిన డిమాండ్ల పట్ల సానుకూలంగా ఉన్నామని.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో వీటిని పరిష్కరిస్తామని  మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. రాజకీయ శక్తుల చేతుల్లో చిక్కుకోవద్దని అంగన్‌వాడీలను కోరుతున్నానని మంత్రి అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: