వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం సీఎం జగన్‌ మేనిఫెస్టో అమలునే నమ్ముకున్నారు. నిన్న వైకాపా విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్.. వచ్చే ఎన్నికలకు సన్నద్దత, సహా పలు కీలక అంశాలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ , పార్టీ నాయకుడు వ్యవహార శైలి చూసి కార్యకర్తలు కాలర్ ఎగరేసేలా ఉండాలన్నారు జగన్. నాయకుడు, పార్టీ అలా ఉంటేనే గ్రామ స్థాయిలో క్యాడర్ కు గౌరవం లభిస్తుందన్నారు. 2014లో సాధ్యం కాని హామీలతో చంద్రబాబు మేని ఫెస్టోలో విడుదల చేశారన్న జగన్.. ప్రతి సామాజిక వర్గానికి న్యాయం చేస్తానని చంద్రబాబు మోసం చేశారన్నారు.

2014 లో అధికారంలోకి వచ్చాక మేని ఫెస్టో లోని  కీలక హామీలను చంద్రబాబు గాలికొదిలేశారన్న జగన్.. మోసం ఎప్పుడూ నిలబడదని.. రాజకీయాల్లో విశ్వసనీయత ముఖ్యమని.. అమలు చేసే వాటినే మేనిఫెస్టోలో పెట్టి ప్రకటించామన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన 99 శాతం హామీలన్నింటినీ అమలు చేశామన్న జగన్.. మేని ఫెస్టో కాపీ ప్రజల చేతి కిచ్చి అమలు చేసిన వాటిని టిక్ పెట్టమని అడిగామని.. ఆ నిబద్దత, చిత్తశుద్ది వైకాపా కు మాత్రమే ఉందని తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: