ఏపీ రాజకీయాల్లో ఇంకో అదిరిపోయే ట్విస్ట్.. అనపర్తి నుంచి టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పోటీ చేయబోతున్నారు. అదేంటి.. ఆ సీటును టీడీపీ బీజేపీకి త్యాగం చేసింది కదా అంటారా.. అవును త్యాగం చేసింది. అయితే.. ఆ సీటు నుంచే నల్లమిల్లి పోటీ చేస్తారు.. అయితే రెబెల్‌గా కాదు.. బీజేపీ టికెట్‌పై నుంచి.. పోటీ చేస్తారట. స్థానికంగా నల్లమిల్లికి ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా ఈ సీటును బీజేపీ సద్దుబాటు చేయాలని ఆలోచిస్తోందట. అనపర్తి టికెట్ పై తెలుగుదేశం అధిష్టానం బీజేపీతో సుదీర్ఘంగా చర్చలు జరిపింది. నల్లమిల్లి రామకృష్ణ రెడ్డితో గోరంట్ల బుచ్చయ్య చౌదరి, సుజయ్ కృష్ణ రంగారావు చర్చలు జరిపారు. నల్లమిల్లితో చంద్రబాబు కూడా ఫోన్లో మాట్లాడారు.

జెండా ఏదైనా కూటమి అజెండా గెలవాలని చంద్రబాబు ఆయనకు సూచించినట్టు తెలుస్తోంది. బీజేపీ టికెట్‌పై నల్లమిల్లి పోటీ చేసినా తమకు అభ్యంతరం లేదని ఆ పార్టీ అధిష్టానం చెప్పినట్టు తెలిసింది. ఇవాళ నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి తన రాజకీయ నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: