సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇప్పటివరకు జప్తు చేసిన సొత్తు, సీ విజిల్‌ ద్వారా నమోదైన కేసుల వివరాలను ఎన్నికల సంఘం తాజాగా ప్రకటించింది. ఇంతవరకూ 8,889 కోట్ల రూపాయల మేర విలువైన నగదు, మాదక ద్రవ్యాలు, ఇతర తాయిలాలను స్వాధీనం చేసుకున్నట్లు ఈసీ నివేదిక వెల్లడించింది. అందులో 3వేల 958 కోట్ల రూపాయల మేర డ్రగ్స్‌ ఉన్నట్లు ఈసీ నివేదిక తెలిపింది. జప్తు చేసిన సొత్తులో మాదక ద్రవ్యాల వాట 45 శాతంగా ఉందని ఈసీ నివేదిక పేర్కొంది.


అత్యధికంగా గుజరాత్‌లో సుమారు 1462 కోట్ల రూపాయల విలువైన ప్రలోభాలను స్వాధీనం చేసుకున్నట్లు ఈసీ ప్రకటించింది. ఎన్నికల నియమావళి ఉల్లంఘనలకు సంబంధించి ...సీ-విజిల్‌’యాప్‌కు రెండు నెలల్లోనే దాదాపు 4 లక్షల 24 వేల ఫిర్యాదులు వచ్చినట్లు ఈసీ నివేదిక  తెలిపింది. వాటిలో 4 లక్షల 23 వేల 908 ఫిర్యాదులను పరిష్కరించినట్లు ఈసీ నివేదిక  పేర్కొంది. దాదాపు 89 శాతం కేసులను వంద నిమిషాల్లోనే ఛేదించినట్లు ఈసీ నివేదిక వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: