దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రూపాయిల్లో పెరుగుతూ పైసల్లో తగ్గుతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో ముడి చమురు ధరలు భారీగా తగ్గినా దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లలో పెద్దగా మార్పు లేదు. వాహనదారులు చమురు ఉత్పత్తుల ధరలు ఎప్పుడు తగ్గుతాయో అర్థం కావడం లేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే అతి త్వరలోనే భారీగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గనున్నాయి. ఒపెక్ దేశాలు డిమాండ్ కు తగినట్లు ఉత్పత్తి తగ్గించాలని జరిపిన చర్చలు ఫలించలేదు. 
 
మార్కెట్లోకి భారీ స్థాయిలో సౌదీఆరామ్ కో చమురును విడుదల చేసింది. భారీగా పెట్రో ఉత్పత్తి పెరగడంతో బ్యారెల్ మూడి చమురు ధర 35 డాలర్లకు చేరి క్రూడ్ ఆయిల్ ధరలు 30 శాతానికి పైగా తగ్గాయి. అంతర్జాతీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గినా మన దేశంలో 15 రోజుల తర్వాత ధరలను సవరించనుండటంతో పెట్రోల్, డీజిల్ ధరలలో పెద్దగా మార్పులు లేవు. మరో పది రోజుల్లో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గనున్నాయని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అధికారి చెబుతున్నారు. 
 
5రూపాయల నుంచి 7రూపాయల వరకు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గనున్నాయని సమాచారం. 7రూపాయల కంటే ఎక్కువ తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. ఈరోజు లీటర్ పెట్రోల్ ధర 74 రూపాయలు కాగా లీటర్ డీజిల్ ధర 67.86 రూపాయలుగా ఉంది. మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్సైజ్ సుంకాన్ని పెంచితే మాత్రం వినియోగదారులకు భారీగా లబ్ధి చేకూరే అవకాశం ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: