ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రవ్యాప్తంగా డిసెంబర్ నెలలో మధ్యం అమ్మకాలు భారీగానే పెరిగాయి. ముఖ్యంగా నూతన సంవత్సర వేడుకలు ప్రారంభంతో డిసెంబర్ 2025 మద్యం అమ్మకాలు కూడా చాలా జోరుగానే సాగినట్టు కనిపిస్తున్నాయి. డిసెంబర్ 1 నుంచి 31వ తేదీ వరకు ఏపీలో మొత్తం మీద రూ. 2,767 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగినట్లుగా తెలియజేస్తున్నారు. గత ఏడాది 2024తో పోలిస్తే ఈసారి 8% వరకు పెరిగిందట. 2024లో రూ.2,568 కోట్లు జరిగింది.


కానీ ఈ ఏడాది డిసెంబర్ చివరి 3 రోజులలో భారీ స్థాయిలో సేల్స్ నమోదు అయినట్లుగా ఎక్సైజ్ అధికారుల తెలియజేస్తున్నారు. డిసెంబర్ 29, 30,31 రోజులలో సుమారుగా రూ .540 కోట్లకు పైగా లిక్కర్ అమ్మకాలు జరిగినట్లుగా తెలుస్తోంది. 2024 ఏడాదిలో ఇదే మూడు రోజులలో కేవలం రూ .350 కోట్ల రూపాయల ఆదాయం మాత్రమే నమోదు అయింది. అయితే ఈ ఏడాది లిక్కర్ సేల్స్ పెరగడానికి న్యూ ఇయర్ వేడుకలు, సెలవులే కారణమని అధికారులు చెబుతున్నారు. జిల్లాల వారీగా మద్యం అమ్మకాల విషయానికి వస్తే..


విశాఖపట్నం మొదటి స్థానంలో ఉన్నది ఏకంగా రూ. 178.6 కోట్ల లిక్కర్ అమ్మకాలు జరిగాయి. ఆ తర్వాత తిరుపతి జిల్లా రూ. 169.4 కోట్లు, ఆ తర్వాత స్థానం ఎన్టీఆర్ జిల్లా రూ. 155.4 కోట్లు, అల్లూరి సీతారామరాజు జిల్లాలో  రూ.30.7 కోట్లు, ఈ జిల్లాలోని తక్కువగా మద్యం అమ్మకాలు నమోదైనట్లుగా తెలుస్తోంది. పార్వతీపురం మాన్యంలో రూ.35.4  కోట్లు, శ్రీ సత్య సాయి జిల్లాలో 65 కోట్ల వరకు జరిగినట్లు అధికారులు తెలియజేస్తున్నారు. రోజువారి సేల్స్ తో పోలిస్తే ఈ న్యూ ఇయర్ సమయంలోనే దాదాపుగా రెట్టింపు అమ్మకాలు జరిగినట్లుగా సమాచారం. మొత్తానికి డిసెంబర్ నెల మొత్తం కూడా లిక్కర్ సేల్స్ వల్ల రాష్ట్రానికి భారీ ఆదాయం వచ్చిందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: