మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఫేస్‌బుక్,  ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు యూట్యూబ్‌లో కూడా ఈ టాపిక్ హాట్ టాపిక్‌గా మారింది. అభిమానుల మధ్యనే కాకుండా సినీ వర్గాల్లో కూడా ఈ వార్తపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. దాదాపుగా ఈ సినిమా షూటింగ్ అంతా పూర్తయ్యిందని, కేవలం చిన్న ప్యాచ్ వర్క్ మాత్రమే మిగిలి ఉందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఇక షూటింగ్ పూర్తయ్యే దశకు చేరుకోవడంతో, సినిమా ప్రమోషన్స్‌ను కూడా చాలా ప్లాన్‌గా ముందుకు తీసుకెళ్లేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన భారీ అప్డేట్స్ ఉండబోతున్నాయని టాక్.అంతేకాదు, ఈ సినిమా మార్చి 27వ తేదీన, అంటే రామ్ చరణ్ బర్త్‌డే సందర్భంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుందని ప్రచారం జరుగుతోంది. దీంతో అభిమానులు ఇప్పటికే భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు.

ఇక ఈ సినిమా తర్వాత రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో మరో సినిమాకు కమిట్ అయ్యాడని వార్తలు వచ్చాయి. అయితే ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఎప్పటి నుంచి మొదలవుతుంది అన్నదానిపై ఇప్పటివరకు స్పష్టత రాలేదు. ఇదే సమయంలో మరో ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. అదేంటంటే… రామ్ చరణ్ భార్య ఉపాసన రెండోసారి గర్భం దాల్చిన విషయం తెలిసిందే. ఆమె డెలివరీ టైమ్ కూడా దగ్గరపడుతుండటంతో రామ్ చరణ్ కొంతకాలం సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయించుకున్నాడని ప్రచారం జరిగింది.

ఆ వార్తలు బయటకు వచ్చిన వెంటనే, కొద్దిరోజులకే అవన్నీ ఫేక్ న్యూస్ అంటూ క్లియర్ అయింది. అయినప్పటికీ ఇప్పుడు రామ్ చరణ్ ప్రవర్తన చూస్తుంటే, అప్పట్లో వినిపించిన ఆ వార్తల్లో నిజం ఉందేమో అన్న అనుమానాలు మళ్లీ మొదలయ్యాయి.సినీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం, ఇటీవల రామ్ చరణ్‌ను కలవడానికి వెళ్లిన పలువురు కొత్త దర్శకులకు ఆయన సినిమా స్టోరీలు వినడానికే ఆసక్తి చూపడం లేదట. కాల్ షీట్స్ అడ్జస్ట్ కావడం లేదని, ప్రస్తుతం డేట్స్ లేవని చెప్పి వారిని వెనక్కి పంపిస్తున్నారని టాక్. అంతేకాదు, ముందుగా ప్లాన్ చేసుకుని ట్రిప్స్ వెళ్లడం కూడా ఆయన పూర్తిగా మానేశారని సమాచారం.

ఇక సినిమా ప్రమోషన్స్ విషయంలో కూడా రామ్ చరణ్ చాలా లిమిటెడ్‌గా మాత్రమే పాల్గొంటున్నారని తెలుస్తోంది. విదేశాలకు వెళ్లి ప్రమోషన్స్ చేయడానికి కూడా ఆసక్తి చూపించడం లేదట. ఈ విషయాన్ని దర్శకుడు బుచ్చిబాబుకు కూడా చాలా క్లియర్‌గా చెప్పేశారని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది.ఈ అన్ని పరిణామాలను గమనిస్తున్న అభిమానులు, నెటిజన్లు ఒకే మాట అంటున్నారు. రామ్ చరణ్ నిజంగానే తన వ్యక్తిగత జీవితానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ, రెండోసారి తండ్రి అవబోతున్న ఆ మధుర క్షణాలను మిస్ కాకుండా కుటుంబంతో గడపాలని నిర్ణయించుకున్నాడని అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఉపాసనకు ఈ సమయంలో పూర్తిగా అండగా ఉండాలనే ఉద్దేశంతోనే సినిమాలకు కొంత బ్రేక్ ఇస్తున్నాడని జనాలు మాట్లాడుకుంటున్నారు.

ఇలా చూస్తే, అప్పట్లో ఫేక్ అని కొట్టిపారేసిన వార్తలే ఇప్పుడు నిజమవుతున్నట్లుగా అనిపిస్తోందని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే రామ్ చరణ్ నుంచే అధికారికంగా స్పందన రావాల్సిందే. అప్పటివరకు మాత్రం ఈ టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉండడం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: