సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్లో చిరంజీవితో మన శంకర వరప్రసాద్ గారు సినిమా చేసిన సంగతి మనకు తెలిసిందే.ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయింది. మరికొద్ది రోజుల్లో విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఇలాంటి సమయంలో నయనతార గురించి ఓ వార్త సినీ వర్గాల్లో తెగ చక్కర్లు కొడుతోంది. అదేంటంటే..ఎప్పుడు లేనిది నయనతార చిరంజీవితో నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా కోసం ప్రమోషన్స్ చేసింది.అయితే నయనతార ప్రమోషన్స్ చేయడం చాలా అరదు. ఎప్పుడో ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ప్రమోషన్స్ చేసింది. కానీ ఆ తర్వాత చాలా సంవత్సరాలుగా నయనతార సినిమాలకు ప్రమోషన్స్ చేయడం లేదు. దానికి కారణాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా  సినిమాకి సంబంధించిన ప్రమోషన్లలో, ఈవెంట్లలో హీరోలకు ఇచ్చినట్లుగా హీరోయిన్లకు గౌరవ మర్యాదలు ఇవ్వరు అనే ఉద్దేశంతో  నయనతార చాలా సంవత్సరాల నుండి సినిమా ప్రమోషన్స్ కి దూరంగా ఉంటుంది. 

ఆమె ఎంత పెద్ద హీరోతో సినిమా చేసినా సరే ఆ సినిమా ప్రమోషన్స్ కి అస్సలు రాదు. సినిమాకి ఓకే చెప్పే ముందే ఈ విషయంలో అగ్రిమెంట్ చేసుకొని నేను ప్రమోషన్స్ కి రానని చెప్పేస్తుంది.కానీ చాలా సంవత్సరాల తర్వాత నయనతార మొదటిసారి చిరంజీవితో కలిసి నటిస్తున్న మన శంకర వరప్రసాద్ గారు సినిమా కోసం ప్రమోషన్ చేసింది. ఈ సినిమా మొదట్లో హీరోయిన్ ని ఇంట్రడ్యూస్ చేసే సమయంలోనే నయనతార తో ప్రమోషన్స్ చేయించారు అనిల్ రావిపూడి.ఆ సమయంలో ఇండస్ట్రీ మొత్తం షాక్ అయింది.ఇదేంటి అసలు ప్రమోషన్స్ చేయని నయనతార కి అనిల్ రావిపూడి ఏం చెప్పి ఒప్పించారు అని అంతా ఆశ్చర్యపోయారు.అయితే ఇదిలా ఉంటే తాజాగా సినిమా షూటింగ్ పూర్తి అవ్వడంతో మరో ప్రమోషన్ కూడా చేసింది నయనతార. సినిమా రిలీజ్ డేట్ ని చెబుతూ ఓ ప్రమోషనల్ వీడియోలో కనిపించింది.

దీంతో చాలామంది ఈ వీడియో చూసి ఆశ్చర్యపోతున్నారు.అసలు ఆమె నయనతారనేనా.. ఎంత పెద్ద హీరో సినిమా నైనా సరే ప్రమోషన్స్ కి రాని ఈ ముద్దుగుమ్మ ఇలా మారిపోయింది ఏంటి? అనిల్ రావిపూడి ఏం చేసావయ్యా మా నయనతార ని ఇలా మార్చేసావు అని ఎంతోమంది షాక్ అయిపోయారు.ఈ నేపథ్యంలోనే చాలామంది నయనతార ప్రమోషన్స్ చేయడం చూసి నయనతార ఇలా చిరంజీవి సినిమాకి ప్రమోషన్స్ చేయడం గురించి కోలీవుడ్ ఇండస్ట్రీ స్పందన ఎలా ఉంటుందో అంటూ మాట్లాడుకుంటున్నారు. అయితే మన శంకర వరప్రసాద్ గారు సినిమా కోసం నయనతార తన రూల్స్ బ్రేక్ చేసుకొని ప్రమోషన్స్ చేసింది. ఇలాగే సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి, మిగతా స్టేజ్ ప్రమోషన్లకి వస్తుందా అనేది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: