షణ్ముఖ్ జస్వంత్… ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఒక టాప్ మోస్ట్ పాన్ ఇండియా హీరోకి ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో, దానికి డబుల్ కాదు… ట్రిపుల్ స్థాయిలో అభిమానులను సంపాదించుకున్న వ్యక్తి షణ్ముఖ్ జస్వంత్. ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా, ఎవరి సపోర్ట్ కూడా లేకుండా కేవలం తన టాలెంట్, కష్టపడే తత్వం, యూట్యూబ్ అనే ఒకే ఒక్క వేదికను ఆధారంగా చేసుకుని ఈ స్థాయికి ఎదగడం నిజంగా అభినందనీయం.

యూట్యూబ్ ద్వారా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకోవడం అనేది మామూలు విషయం కాదు. షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్‌లతో యువతలో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నాడు షణ్ముఖ్ జస్వంత్. ముఖ్యంగా యూత్ ఆడియన్స్ అతని స్టైల్, యాక్టింగ్, డైలాగ్ డెలివరీకి ఫిదా అయిపోయారు. సోషల్ మీడియాలో అతనికి ఉన్న క్రేజ్ అప్పట్లో సినీ హీరోలకే పోటీగా ఉండేది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.ఈ క్రమంలోనే షణ్ముఖ్ జస్వంత్ తన సహనటి అయిన దీప్తి సునయనతో ప్రేమలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఇద్దరూ కలిసి చేసిన ప్రాజెక్ట్స్, వారి మధ్య ఉన్న కెమిస్ట్రీ, బయట కూడా కలిసి కనిపించడం వల్ల వీరి ప్రేమ నిజమైనదేనని అభిమానులు బలంగా నమ్మారు. చాలామంది వీరిని ఒక ఐడియల్ కపుల్‌గా కూడా భావించారు.అయితే పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. షణ్ముఖ్ జస్వంత్ బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన తర్వాత అతని ఇమేజ్ పూర్తిగా మారిపోయిందనే చెప్పాలి. బిగ్ బాస్ షోలో అతను ప్రవర్తించిన తీరు, ముఖ్యంగా సిరి హనుమంతుతో అతని వ్యవహారం ప్రేక్షకులకు నచ్చలేదు. సోషల్ మీడియాలో అతనిపై నెగటివ్ రోలింగ్ భారీగా మొదలైంది. అప్పటి వరకు హీరోలా చూసిన అభిమానులే విమర్శకులుగా మారిపోయారు.




బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత షణ్ముఖ్ జస్వంత్‌కు మరో పెద్ద షాక్ ఎదురైంది. అతనితో చాలా సంవత్సరాలుగా రిలేషన్‌లో ఉన్న దీప్తి సునయన బ్రేకప్ ప్రకటించింది. ఈ విషయం సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. ఒకప్పుడు వీరి ప్రేమను ఆకాశానికి ఎత్తేసినవాళ్లే, ఇప్పుడు వీరి బ్రేకప్‌పై రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కొంతకాలం పాటు ఈ టాపిక్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే కాలక్రమంలో ప్రజలు ఈ విషయాన్ని మర్చిపోయారు.ఇలా గడిచిన కొంతకాలం తర్వాత, తాజాగా మరోసారి షణ్ముఖ్ జస్వంత్ వార్తల్లో నిలిచాడు. తన జీవితంలోకి కొత్త అమ్మాయి వచ్చినట్లు సూచించేలా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేశాడు. న్యూ ఇయర్ తరువాత రోజు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన కొత్త ప్రేయసిని పరిచయం చేస్తూ ఆమెకు బర్త్‌డే విషెస్ తెలియజేశాడు. అయితే ఆ పోస్ట్‌లో ఆమె పేరు, ఇతర వివరాలు ఏవీ వెల్లడించలేదు. అంతేకాదు, ఆమె ముఖం కూడా కనిపించకుండా జాగ్రత్త పడ్డాడు.

ఆ ఫోటోలకు “హ్యాపీ బర్త్‌డే, వి… గాడ్స్ ప్లాన్” అనే క్యాప్షన్ రాయడంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగిపోయింది. దీంతో షణ్ముఖ్ జస్వంత్ కొత్త గర్ల్‌ఫ్రెండ్ పేరు ‘వి’ అక్షరంతో మొదలవుతుందని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. కొంతమంది ‘వి’తో మొదలయ్యే ప్రముఖ యూట్యూబర్లను ట్యాగ్ చేస్తూ “ఇదేనా ఆమె?”, “వాళ్లేనా?” అంటూ కంగ్రాట్స్ చెప్పడం మొదలుపెట్టారు.మరికొంతమంది అయితే పెళ్లి ఎప్పుడు అంటూ ప్రశ్నలు వేస్తున్నారు. ఇంకొందరు మాత్రం “న్యూ లైఫ్ స్టార్ట్ చేసినందుకు హ్యాపీగా ఉంది”, “మంచి జీవితాన్ని ప్రారంభించావు” అంటూ సపోర్ట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు కొందరు నెటిజన్లు మాత్రం ఇది నిజమైన ప్రేమా? లేక రాబోయే వెబ్ సిరీస్ లేదా సినిమా ప్రమోషన్‌లో భాగమా? అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉండగా, కొంతమంది సోషల్ మీడియా యూజర్లు మాత్రం పోలికలు చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. దీప్తి సునయనతో పోల్చుతూ “ఇంతకన్నా ఈ అమ్మాయి ఫిగర్ కత్తిలా ఉంది” అంటూ అసభ్యకరమైన కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఇవి మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.మొత్తానికి షణ్ముఖ్ జస్వంత్ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిపోయాడు. అతని వ్యక్తిగత జీవితం అయినా, ప్రొఫెషనల్ లైఫ్ అయినా ఎప్పుడూ ఏదో ఒక కారణంతో వార్తల్లో ఉండటం మాత్రం ఖాయం. ఇక ఈ కొత్త రిలేషన్ నిజమా? లేక ఏదైనా ప్రాజెక్ట్ ప్రమోషనా? అన్నది కాలమే నిర్ణయించాలి. అప్పటివరకు మాత్రం షణ్ముఖ్ జస్వంత్ పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: