టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన చిత్రం రాజాసాబ్. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 9వ తేదీన ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ప్రభాస్ లైనఫ్ చూస్తే భారీ ప్రాజెక్టులు సైతం చేతిలో ఉన్నాయి. అందులో గత ఏడాది జూన్ లో విడుదలైన కల్కి సినిమా సీక్వెల్ కల్కి 2.ఈ చిత్రాన్ని డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించగా రూ .1000 కోట్ల రూపాయల సినిమాగా నిలిచింది. ఇందులో అమితాబ్ బచ్చన్, కమలహాసన్, దీపికాపదుకొనే తో పాటుగా మరి కొంతమంది సెలబ్రిటీలు నటించారు.


అయితే ఇటీవలే కల్కి 2 విషయంలో దీపికాను తప్పించినట్లు మేకర్స్ అఫీషియల్ గా తెలియజేశారు. అందుకు దీపికా పదుకొనే పెట్టినటువంటి కండిషన్ వల్లే ఆమెను తప్పించినట్లుగా వార్తలు అయితే వినిపించాయి. దీంతో అసలు ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు జరుగుతుందనే విషయంపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. ప్రస్తుతం అయితే ప్రభాస్ స్పిరిట్, ఫౌజీ వంటి షూటింగ్లలో బిజీగా ఉన్నారు. ఒకేసారి ఈ రెండు సినిమాల షూటింగ్ ను కూడా హ్యాండిల్ చేస్తూ ముందుకు వెళ్తున్న ప్రభాస్ ఇప్పుడు కల్కి 2 సినిమా కోసం డేట్లు ఇచ్చినట్లుగా వినిపిస్తున్నాయి.


ఫిబ్రవరి 2026 నుంచి కొన్ని రోజులపాటు కల్కి 2 చిత్రానికి సంబంధించి డేటాను కేటాయించారని సమాచారం. మొదటి భాగంలో కొంతమేరకు షూటింగ్ చేసి పెట్టుకున్న డైరెక్టర్  ప్రభాస్ డేట్స్ అడ్జస్ట్ కాలేకపోవడంతో విరామం తీసుకున్నట్లు తెలుస్తోంది. అందుకే ఇప్పుడు ఫిబ్రవరిలో కొన్ని రోజులు డేట్ ఇవ్వడంతో ఓకే చెప్పినట్టుగా వినిపిస్తున్నాయి. కల్కి 2 సినిమాకి ఎక్కువగా విఎఫ్ఎక్స్ కే ఎక్కువ సమయం పడుతుంది. ముఖ్యంగా ఇందులో సన్నివేశాలకే ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. కనుక ప్రభాస్ ఇప్పుడు మూడు సినిమాల షూటింగ్ ఎలా మెయింటైన్ చేస్తారు లుక్స్ ఎలా మైంటైన్ చేస్తారనే విషయమే ఇప్పుడు అభిమానులలో మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: