ఇటీవల సినీ నటుడు శివాజీ హీరోయిన్స్ డ్రెస్సింగ్ సెన్స్‌పై చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. ఆయన మాట్లాడిన తర్వాత కావాలనే కొంతమంది హీరోయిన్లు మరింత బోల్డ్‌గా ఫోటోషూట్లు చేస్తున్నారన్న విమర్శలు సోషల్ మీడియాలో విస్తృతంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా అందాల ముద్దుగుమ్మ, స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ షేర్ చేసిన ఫోటోలు ఈ చర్చకు మరింత బలం చేకూర్చినట్టయ్యాయి.హీరోయిన్ కాజల్ అగర్వాల్ అనగానే ట్రెడిషనల్ లుక్‌తో పాటు మోడ్రన్ అవతారంలోనూ ప్రేక్షకులను ఆకట్టుకునే నటి అనే పేరు ఉంది. చీరలో సంప్రదాయంగా కనిపించినా, వెస్ట్రన్ డ్రెస్సుల్లో గ్లామర్‌గా కనిపించినా ఆమెకు ప్రత్యేకమైన అభిమాన వర్గం ఉంది. అయితే న్యూ ఇయర్ సందర్భంగా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన కొన్ని కొత్త ఫోటోలు మాత్రం అనూహ్యంగా హడావుడి సృష్టిస్తున్నాయి.

ఆ ఫోటోలలో ముఖ్యంగా ఒక చిత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. బెడ్‌పై దుప్పటి కప్పుకుని ల్యాప్‌టాప్ చూస్తున్నట్లుగా ఉన్న ఆ ఫోటోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. దుస్తులు లేకుండా కేవలం దుప్పటితోనే కనిపించినట్టుగా ఉందని కొందరు అభిప్రాయపడుతుంటే, ఇది మరీ హద్దులు దాటిందంటూ మరికొందరు మండిపడుతున్నారు.“కాజల్ ఇంతకుముందు ఎప్పుడూ ఇలాంటి ఫోటోలు షేర్ చేయలేదు కదా, ఇప్పుడు కావాలనే ఇలా చేస్తుందా?” అని ప్రశ్నిస్తున్నారు కొందరు. “పెళ్లయింది, పైగా ఒక బాబు కూడా ఉన్నాడు… ఇలాంటి ఫోటోలు షేర్ చేయడం అవసరమా?” అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. శివాజీ చేసిన వ్యాఖ్యలకు ఈ ఫోటోలు సమాధానమా? ఆయన చెప్పిన మాటల్లో తప్పేమీ లేదేమో అంటూ కొంతమంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఇదే సమయంలో కాజల్‌కు మద్దతుగా నిలిచే వాళ్లూ లేకపోలేదు. “ఆమె ఫోటోలు ఆమె ఇష్టం, మిగతా వాళ్లకు సమస్య ఏంటి?” అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. “తన భర్తకు లేని ప్రాబ్లం మీకెందుకు?” అంటూ ఘాటుగా స్పందిస్తున్న అభిమానులు కూడా ఉన్నారు. ఒక నటి తన వ్యక్తిగత జీవితంలో, తన సోషల్ మీడియా ఖాతాలో ఏమి షేర్ చేయాలనుకుంటుందో అది పూర్తిగా ఆమె వ్యక్తిగత విషయం అన్న వాదన వినిపిస్తోంది.ఇంకొంతమంది అయితే ఈ ఫోటోను కావాలనే కొందరు శివాజీ వ్యాఖ్యలకు కౌంటర్‌గా షేర్ చేసి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం హద్దు దాటి బోల్డ్ కామెంట్లు చేస్తూ విమర్శలకు తావిస్తున్నారు. ఏదేమైనా కాజల్ అగర్వాల్ షేర్ చేసిన ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారి, పెద్ద ఎత్తున చర్చకు కారణమైంది.

సెలబ్రిటీల వ్యక్తిగత స్వేచ్ఛ, సమాజపు ఆలోచనలు, సోషల్ మీడియా విమర్శలు—ఈ మూడు మధ్య నడుస్తున్న ఈ తరహా వివాదాలు మరికొంత కాలం ఇలాగే కొనసాగుతాయేమో అన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. కాజల్ ని అందరు ముద్దుగా బన్నీ బ్యూటీ అని పిలుచుకుంటారు. బన్నీ తో ఎక్కువ సినిమాల్లో నటించడం ..అన్ని సినిమాలు హిట్ అవ్వడం ఆమె కెరీయర్ కి ప్లస్ గా మారింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: