అరటిపండ్లు అమ్ముతున్న సమయంలోనే పక్కనే ఉన్న థియేటర్లో సినిమాలు చూస్తూ, సినిమా పోస్టర్లను గమనిస్తూ ఉండేవారు. ఆ ఆసక్తితోనే ఆయన యానిమేషన్ నేర్చుకుని మెల్లగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు.మారుతి ఎదుగుదల ఏ ఒక్క రోజులోనో జరిగింది కాదు. ఆయన ప్రతి అడుగులోనూ ఎంతో కృషి ఉంది.
ఆర్య (Arya): అల్లు అర్జున్ నటించిన 'ఆర్య' సినిమాకు మారుతి డిస్ట్రిబ్యూటర్‌గా పనిచేశారు. తన పెళ్లికి కట్నంగా వచ్చిన డబ్బుతో ఆ సినిమా హక్కులు కొని లాభాలు సాధించారు.ఈ రోజుల్లో కేవలం రూ. 50 లక్షల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాతో దర్శకుడిగా మారి రూ. 10 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టారు.ఒకప్పుడు అరటిపండ్లు అమ్మిన అదే థియేటర్ల వద్ద నేడు మారుతి డైరెక్ట్ చేస్తున్న ప్రభాస్ సినిమా 'ది రాజా సాబ్' కటౌట్లు కనిపిస్తున్నాయి. ఇది ఆయన విజయానికి నిదర్శనం."కష్టపడే తత్వం ఉంటే ఎక్కడి నుండైనా ఎక్కడికైనా వెళ్లవచ్చు" అని మారుతి నిరూపించారు. బూతు దర్శకుడు అనే ముద్ర వేసిన చోటే నేడు 'ఫ్యామిలీ ఎంటర్‌టైనర్' దర్శకుడిగా, ఇప్పుడు 'పాన్ ఇండియా' దర్శకుడిగా ఆయన ఎదిగిన తీరు స్ఫూర్తిదాయకం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి