డైరెక్టర్ :సింపుల్ సుని
ప్రొడ్యూసర్స్ :సెర్వెగ్ర సిల్వర్ స్క్రీన్స్, సుని సినిమాస్.
ఎడిటర్: ఆశిక్ కుసుగోలి
నా స్వామి రంగ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గర అయినటువంటి ఆశికా రంగనాథ్ అంటే తెలియని వారు ఉండరు. అయితే ఈమె హీరోయిన్ గా నటించిన తాజా చిత్రం గత వైభవం. సోషియో ఫాంటసీ థ్రిల్లర్ గా వచ్చినటువంటి ఈ సినిమా జనవరి 1 వ తేదీన రిలీజ్ అయి ప్రేక్షకులకు దగ్గరవుతోంది.. మరి ఈ సినిమా ఎవరిని ఎలా మెప్పించింది ఎలా ఉంది అనేది తెలుసుకుందాం..
సినిమా స్టోరీ:
ఆర్టికల్చర్ విద్యార్థి అయినటువంటి ఆధునిక (ఆశికా రంగనాథ్ )కు పెయింటింగ్స్ వేయడం అంటే చాలా ఇష్టం. అయితే ఆమె ఊహల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి పెయింటింగ్ వేస్తుంది. ఆ తర్వాత కొనాళ్లకు సేమ్ ఆమె వేసిన పెయింటింగ్స్ తో ఉన్న వ్యక్తి తనకు తారసపడతాడు, ఆయనే దుష్యంత్. ఈయన ఒక విజువల్ ఎఫెక్ట్ స్టూడియో నడుపుతూ ఉంటాడు. అయితే ఆశికా రంగనాథ్ తనకు తెలియకుండానే అతని దగ్గరికి వెళ్తుంది. ఆ తర్వాత తన గత జన్మ గురించి చెప్పడంతో అతను షాక్ అవుతాడు. మరి పూర్వకాలంలో నుంచి వీరి మధ్య ఉన్న బంధం ఏమిటి.. అంతేకాకుండా దుష్యంత్ తండ్రి కృష్ణకు ఈ కథతో ఉన్న సంబంధం ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
నిజానికి చాలామంది ప్రేక్షకులు గత జన్మల నేపథ్యంలో వచ్చే కథలను ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఈ చిత్రాలను భయంతో చూసినా కానీ చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తూ ఉంటారు. ఆ విధంగానే గత వైభవం సినిమా కూడా దాని బేస్ మీదే వచ్చింది. వందల సంవత్సరాల క్రితం కనీసం ఒకరి మొహం ఒకరు చూసుకోకుండానే ఉత్తరాల ద్వారా ప్రేమించుకునే మంగళ-చెన్నయ్య పాత్రల కథ చాలా బాగుంది. కర్ణాటక రాష్ట్ర సంప్రదాయ క్రీడ అయినటువంటి కంబళ నేపథ్యంలో సాగే ఈ పీరియాడిక్ ఎపిసోడ్ సినిమాకు మంచి టర్నింగ్ పాయింట్. ఇక ఈ సినిమాను అద్భుతంగా చూపించడానికి డైరెక్టర్ సుని చాలా కష్టపడ్డాడు. బలమైన ఎమోషన్స్ ఉండాల్సిన చోట స్లోగా, స్లో ఎమోషన్స్ ఉండాల్సిన చోట బలంగా చూపించారు. కొన్ని అసాధారణ సన్నివేశాలు కూడా మధ్యలో ప్రేక్షకులను అసహనానికి గురిచేసాయి. మొదటి భాగం మొత్తం హీరో పురాతన్(దుష్యంత్) క్యారెక్టర్రైజేషన్ మీదే శ్రద్ధ పెట్టాడు. మెయిన్ కథలోకి వెళ్లడానికి డైరెక్టర్ తీసుకున్న సమయం ఈ చిత్రానికి మైనస్ గా చెప్పుకోవచ్చు. ఇక ఇలాంటి చిత్రాలకు గ్రాఫిక్స్ ఎక్కువగా వాడుతారు. కానీ ఈ చిత్రంలో యావరేజ్ ఫీలింగ్ కలిగింది.
నటీనటుల పనితీరు:
గత వైభవం సినిమాకి హీరోయిన్ ఆశికానే ప్రధాన బలం. ఇక ఈమె ఆధునికగా.. మంగళగా.. దేవకన్యగా.. పలు షేడ్స్ లో నటించి అందర్నీ ఆకట్టుకుంది. తన గ్లామర్ తోనే కాకుండా నటనతోను ఆకట్టుకుంది. ఇక కొత్తగా వచ్చిన నటుడు దుష్యంత్ తన వంతు ప్రయత్నం చేశాడు. ఈయన పిరియాడిక్ రోల్ కంటే మోడ్రన్ లుక్ లోనే చాలా బాగున్నాడు. ఇక మిగిలిన నటీనటులు వారి వారి పరిధిలో అద్భుతంగా నటించారు.
సాంకేతిక విభాగం:
ఇక ఈ సినిమా సాంకేతికత విషయానికి వస్తే..ఫోటోగ్రఫీ అద్భుతంగా ఉంది. పాత గ్రామీణ వాతావరణాన్ని చూపించడం ప్రశంసించవచ్చు. ఇక ఈ సినిమాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎంతో బలం. ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే.. కొంచెం జాగ్రత్త తీసుకుంటే బాగుండేది. ఫైనల్ గా ఈ సినిమాను ఒకసారి అయితే చూడవచ్చు.
రేటింగ్ :2.25/5
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి