సాధారణంగా ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికి పీఎఫ్ అకౌంట్ ఉంటుంది. పీఎఫ్ అకౌంట్ ఉన్నవాళ్లు భవిష్యత్ అవసరాల కోసం డబ్బును రెట్టింపు చేసుకునే ఆప్షన్ ఒకటి ఉంది. పీఎఫ్ డబ్బులను రెట్టింపు చేసుకోవాలనుకునేవారు కంపెనీకి పీఎఫ్ కంట్రిబ్యూషన్ ను పెంచమని రిక్వెస్ట్ చేసుకుంటే పీఎఫ్ ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది. కంపెనీ మీ రిక్వెస్ట్ కు అంగీకరిస్తే గతంతో పోలిస్తే పీఎఫ్ కాంట్రిబ్యూషన్ పెరుగుతుంది. 
 
ఇలా చేస్తే పీఎఫ్ డబ్బులు పెరగడంతో పాటు రెట్టింపు పీఎఫ్ ప్రయోజనాలను కూడా పొందే అవకాశం ఉంటుంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ పీఎఫ్ అకౌంట్ పై 8.5 శాతం వడ్డీ ఇస్తోంది. ప్రభుత్వ పథకాల్లో మరే స్కీమ్ కు ఈ స్థాయిలో వడ్డీ లభించడం లేదు. అందువల్ల పీఎఫ్ కాంట్రిబ్యూషన్ ను పెంచుకున్న ఉద్యోగులు ఎక్కువ వడ్డీని పొందే అవకాశం ఉంటుంది. 
 
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ చట్టం పీఎఫ్ అకౌంట్ ఉన్నవారు కంట్రిబ్యూషన్ మొత్తాన్ని పెంచుకునే అవకాశం కల్పించింది. ఉద్యోగి బేసిక్ శాలరీలో 100 శాతం వరకు పీఎఫ్ కంట్రిబ్యూషన్ ను పెంచుకునే అవకాశం ఉంటుంది. పీఎఫ్ కంట్రిబ్యూషన్ మొత్తాన్ని రెట్టింపు చేసుకోవడం ద్వారా రిటైర్మెంట్ సమయంలో అంతే మొత్తం ప్రయోజనాలను పొందవచ్చు. పీఎఫ్ అకౌంట్ పై డబ్బులు కాంపౌoడింగ్ ప్రాతిపదికన జమవుతాయి కాబట్టి రిటైర్మెంట్ సమయంలో భారీ మొత్తాన్ని పొందే అవకాశం ఉంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: