భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా మొదలుపెట్టిన అటల్ పెన్షన్ యోజన పథకాన్ని అసంఘటిత రంగాల్లో కార్మికులకు పెన్షన్ అందించే దిశగా ఈ స్కీం మొదలుపెట్టింది. పేద కార్మికుల కోసం వారి ఉద్యోగ విరమణ తర్వాత వారి వృద్ధాప్యంలో ఆదాయ భద్రత కొరకు ఈ పథకాన్ని 2015 - 16 బడ్జెట్ లో ప్రవేశపెట్టారు. ఇక ఇందులో చేరిన వారికి నిర్ణీత సమయంలో చెల్లించిన మొత్తానికి కలుపుతారు. ఈ పథకం కింద ఓ వ్యక్తి రూ. 1000 నుండి రూ. 5000 మొత్తాన్ని వారి 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల మధ్య ఆదా చేసుకోవడం ద్వారా వారు ఈ పెన్షన్ ని పొందవచ్చు. 

 

 

ఈ పథకం కింద లబ్ధిదారుల నుండి డబ్బులను వారి బ్యాంకు ఖాతాల నుండి ఆటో డెబిట్ ద్వారా తీసుకుంటున్నాయి. అయితే జూలై ఒకటో తేదీ నుండి అటల్ పెన్షన్ యోజన లబ్ధిదారుల బ్యాంకుల నుండి తిరిగి మళ్లీ ఈ ఆటో డెబిట్ మొదలవుతుంది. కరోనా మహమ్మారి దృష్ట్యా బ్యాంకు ఖాతా నుండి ఆటో డెబిట్ ప్రక్రియని నిలిపివేయాలని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఏప్రిల్ నెల నుండి ఆదేశాలు జారీ చేసింది. అందులో పేర్కొన్నట్లు జూన్ 30వ తారీకు వరకు బ్యాంకులకు ఆటో డెబిట్ ను నిలిపి వేయాలని ఆదేశాలు జారీ చేసింది.

 


ఇక ఈ నేపథ్యంలో జూలై ఒకటో తేదీ నుండి మళ్లీ తిరిగి ఈ ఆటో డెబిట్ మొదలుకానుంది. అయితే ఇందుకు గాను సబ్స్క్రైబర్లకు పంపిన ఈ మెయిల్ లో సెప్టెంబర్ 30వ తేదీలోగా పెన్షన్ స్కీం అకౌంట్ ఖాతాను పునరుద్ధరించుకుంటే ఎటువంటి అపరాధ రుసుం వారి దగ్గర నుండి తీసుకోకూడదు అని స్పష్టం చేసింది. ఇలాంటి విషయాల్లో ఒకవేళ ఆలస్యమైతే బ్యాంకులు వారి దగ్గర నుండి అపరాధ రుసుమును కలెక్ట్ చేస్తాయి. అయితే ప్రస్తుతం కరోనా నేపథ్యంలో సెప్టెంబర్ 30 వరకు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా సడలింపు కల్పించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: