అత్యధిక వడ్డీల కారణంగా ఈ రోజుల్లో రుణాలు తీసుకోవాలంటేనే ప్రజలు జంకుతున్నారు. కరోనా కారణంగా ఆర్థికంగా దెబ్బతిన్న చాలామంది భారతీయ ప్రజలు తక్కువ వడ్డీలకు లోన్స్ ఎక్కడా లభిస్తాయా అని అన్వేషిస్తున్నారు. అయితే అలాంటి రుణ గ్రహీతల కోసం ప్రభుత్వ సంస్థ అయిన కెనరా బ్యాంక్ ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. అదేంటంటే, తక్కువ వడ్డీ లకే లోన్స్ ఇస్తామని ప్రకటించింది.


ఆ ప్రకటన ప్రకారం.. ఇల్లు కట్టుకోవాలి అనుకునేవారికి.. అలాగే కారు కొనుగోలు చేసుకునే వారికి కెనరా బ్యాంక్ నుంచి తక్కువ వడ్డీ రేట్లతో లోన్స్ పొందొచ్చు. స్టూడెంట్స్ కూడా లోన్ తీసుకునే అవకాశం ఉంది. 7.35% మూలధన ఆధార ఋణం యొక్క మార్జిన్ (ఎంసీఎల్ఆర్) రేటుతో రుణాలు తీసుకోవచ్చని కెనరా బ్యాంకు ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. అంతేకాదు 6.9% ఆర్ఎల్ఎల్ఆర్‌తో రుణ గ్రహీతలు లోన్ పొందొచ్చని కెనరా బ్యాంకు ప్రకటించింది.



అయితే లోన్ తీసుకోవాలనుకునేవారు ఆన్‌లైన్‌ లోనే అప్పు కోసం దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా కెనరా బ్యాంకు ఒక లింక్ కూడా తన ట్విట్టర్ ఖాతాలో పొందుపరిచింది. ఈ ఆర్టికల్ లో ఇవ్వబడిన ట్వీట్ ద్వారా మీరు ఆ లింక్ ని యాక్సెస్ చేయొచ్చు. ఈ కరోనా నేపథ్యంలో బ్యాంకు కార్యకలాపాలు కొనసాగుతున్నప్పటికీ.. లోన్ దరఖాస్తు కోసం బ్రాంచ్ కి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఈ ఆన్‌లైన్‌ సౌకర్యం కల్పించినట్లు తెలుస్తోంది.



గృహ రుణం, కార్ ఋణం, గోల్డ్ లోన్ తీసుకోవాలని భావించే ప్రజలు ఆన్‌లైన్‌ వేదికగా దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాంకుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా అప్పు పుట్టని ఈ నేపథ్యంలో అతి తక్కువ వడ్డీరేట్ల కే తక్షణ రుణాలు ఇచ్చేందుకు కెనరా బ్యాంకు సిద్ధం కావడం ఒక మంచి శుభవార్త గా చెప్పుకోవచ్చు. రుణం తీసుకోవాలనుకునే వారు తక్షణమే కెనరా బ్యాంకు స్పెషల్ వెబ్సైట్ సందర్శించి త్వరగా దరఖాస్తు చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: