అదానీ.. ఇండియాలో ఇటీవలి కాలంలో వేగంగా ధనవంతుడైన వ్యాపారవేత్త. ఈయన ప్రపంచ కుబేరులైన ఎలాన్ మస్క్, బెన్ జోయిస్‌ లను సైతం తలదన్నేలా సంపాదన ఆర్జించాడు. ఇటీవల ఏకంగా ప్రపంచ వార్తల్లోకి ఎక్కేశాడు. ఈయనో గుజరాతీ పారిశ్రామిక వేత్త. ఈ ప్రముఖ వ్యాపార వేత్త గౌతమ్‌ అదానీ సంపాదన ఈ ఏడాదిలో భారీగా పెరిగింది. అతి ఎక్కువ సంపదను ఆర్జించిన వ్యక్తిగా ఆయన ప్రపంచ రికార్డు సృష్టించారు.

మొన్నటికి మొన్న ప్రపంచ కుబేరుల్లో నంబర్‌ 1 స్థానానికి పోటీ పడుతున్న ఎలన్‌ మస్క్‌, బెజోస్‌ కంటే అదానీ ఈ ఏడాది సంపాదనలో ముందున్నాడు. కొన్నిరోజుల క్రితం వరకూ అదానీ గ్రూప్‌నకు చెందిన వివిధ రంగాల షేర్లు అనూహ్యంగా పుంజుకోవడంతో ఏడాది క్రితం 16.2 బిలియన్‌ డాలర్లుగా ఉన్న అదానీ నికర ఆస్తి విలువ ఏకంగా 86 బిలియన్‌ డాలర్లకు చేరిపోయింది. దేశంలో సంపన్ను ఆస్తులపై సర్వే నిర్వహించే బ్లూమ్‌బెర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ సంస్థ కొన్ని రోజుల క్రితం ఈ వివరాలు వెల్లడించింది.  

అయితే ఇప్పుడు అనూహ్యంగా సీన్ రివర్స్ అయ్యింది. ఒక్క వార్త అదాని సంపదను ఆవిరి చేస్తోంది. కేవలం 5 రోజుల్లోనే పది వేల కోట్ల సంపద ఆవిరైపోయింది. బ్లూబర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్ ప్రకారం ప్రపంచం ఏ వ్యక్తి కోల్పోనంతగా 13.2బిలియన్‌ డాలర్లు ఆయన నష్టపోయారు. ప్రస్తుతం ఆయన సంపద 63.5బిలియన్‌ డాలర్లుగా ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. కొన్నిరోజులక్రితం వరకూ ఆసియాలోనే అత్యంత ధనవంతుడైన ముకేష్‌ అంబానీతో అదానీ పోటీపడగా.. ఇప్పుడు క్రమంగా ఆస్తి కోల్పోతున్నాడు.

వరుసగా ఐదోరోజు రోజువారీ పరిమితిని మించి వాటాలు నష్టపోయాయి. శుక్రవారం అదాని గ్రూప్‌ వాటాలు మరింత పతనమయ్యాయి. మూడు మారిషస్‌ ఫండ్స్‌ సమాచారం తేడాగా ఉందంటూ ఎకనామిక్ టైమ్స్ పత్రిక రాసిన వార్త వెలుగు చూసినప్పటి నుంచి అదాని గ్రూప్‌ వాటాలు నష్టాల బాటలోనే సాగుతున్నాయి. మరి ఈ పతనం ఎందాకా సాగుతుందో..?

మరింత సమాచారం తెలుసుకోండి: