ద్వారాలు తెరిచాం... రండి

కోవిడ్-19 నిబంధనలు, సరిహద్దులో ఉద్రిక్తతలు ఎలా ఉన్నా... మా రాష్ట్రంలో పర్యటించండి. పర్యాటక రంగానికి మేం ద్వారాలు తెరిచాం. ఇక్కడి అందాలు వీక్షించండి. మా సంస్కృతి సంప్రదాయలను పరిశీలించండి అంటూ జమ్మూ, కాశ్మీర్ ప్రభత్వం పర్యాటకానికి పచ్చ జెండా ఉపింది. ఆ  రాష్ట్ర ఆదాయం ఎక్కువ భాగంం పర్యాటక రంగం నుంచే లభిస్తోంది.. కరోనా మహమ్మారి ప్రభావం కారణంగా  రెండు సంవత్సరాలుగా రాష్ట్ర వార్షిక ఆదాయం తగ్గింది. దీంతో ప్రభుత్వ యంత్రాంగం పర్యాటకుల్ని ఆకట్టుకోవడం ద్వారా పూర్వ స్థితిని అందుకోవాలని భావిస్తోంది. పర్యాటకులకు జమ్మూ, కాశ్మీర్ అన్ని కాలాలకు అనువుగా  ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. రానున్న శీతాకాలంలో  కురిసే మంచును  తిలకించేందుకు పెద్ద సంఖ్యలో ప్రకృతి ప్రేమికులు విచ్చేస్తారు.  అక్కడి ప్రకృతి రమణీయ్యతకు మంత్ర ముగ్దులవుతారు.
జమ్మూు, కాశ్మీర్ యంత్రాంగం  దేశంలో ని వివిధ ప్రాంతాలలోతో బాటు, కోల్ కత్తా, అహ్మదాబాద్, హైదరాబాద్, ముంంబై తదితర మహానగరాలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని తాజా గా నిర్ణయించింది. ఈ కార్యక్రమాల ద్వారా  జమ్ము,కాశ్మీర్ గురించి  విస్త్రుతంగా ప్రచారం చేస్తారు. తద్వారా పర్యాటకుల్ని ఆహ్వానిస్తారు.  అంతే కాక టూరిస్టు ఆపరేటర్లతో సమావేశాలు నిర్వహిస్తారు. వారికి పెద్దమొత్తంలో పారితోషికం అందించాలని కూడా అక్కడి ప్రభుత్వ యంత్రంగం భావిస్తోంది. వివిధ వర్గాల వారికి  అంటే ఆర్థిక స్తోమతను బట్టి వివిధ రకాల ప్యాకేజిలు నూతనంగా ఏర్పాటు చేయనున్నారు.  పర్యాటకులు బస చేసే హోటళ్లలో కూడా రాయితీలు ఇచ్చే విధంగా  ఆయా సంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపారు. ఇవి చాలా మటుకు విజయవంతం అయ్యాయి.
అదే విధంగా  దేశంలోని పలు భాషల సినీ నిర్మాతలు, దర్శకులతో నూ జమ్మూ, కాశ్మీర్ యంత్రాంగం సమావేశాలు నిర్వహించ నుంది. తమ  రాష్ట్రంలో సినిమా ఘూటింగ్ లకు అనువైన ప్రదేశాలు, అక్కడ లభించే సౌకర్యాలను సినీ రంగ పెద్దలకు వివరిస్తారు. ఇందుకు సంబంధించిన తొలి అడుగు తెలుగు సినీ పరిశ్రమలోనే పడింది. జమ్మూకాశ్మీర్ అధికారులు  తెలుగు సినీ ప్రముఖులతో చర్చించారు. వారు  జమ్మూ కాశ్మీర్ లో ఘూటింగ్ లు చేసేందుకు సుముఖత వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: