సాంకేతికత పెరిగిపోతున్న నేపథ్యంలో అన్ని డిజిటల్ విధానంలోనే జరిగిపోతున్నాయి. చేతిలో చిన్న స్మార్ట్ మొబైల్ ఉంటె దానితో అన్ని పనులు డిజిటల్ విధానంలోనే చేసుకునే సాంకేతికత అందుబాటులోకి దాదాపు భారత్ లో కూడా వచ్చేస్తుంది. ఇప్పటికే పట్టణాలలో ఈ తరహా చెల్లింపులు భారీగానే జరిగిపోతున్నాయి. గ్రామాలలో కూడా కొద్దిగా ఈ ప్రభావం కనిపిస్తూనే ఉంది. ఇదే తరహాలో భారత్ డిజిటల్ విధానాన్ని అలవాటు చేసుకుంటూ పోతే మరో రెండు ఏళ్లలో పూర్తిగా ఇది అందుబాటులోకి వచ్చినట్టే అంటున్నారు నిపుణులు. ఇప్పటికే అనేక ప్రాంతాలలో ఈ స్థితి వచ్చినప్పటికీ యావత్ దేశంలో ప్రకటనం అవడానికి మరో రెండేళ్లు పట్టొచ్చని వాళ్ళు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా యూనియన్ బ్యాంకు ఎండీ రాజ్ కిరణ్ రాయ్ దీనిపై స్పందించారు. భారత్ లో మరో రెండు మూడేళ్ళలో బ్యాంకు రుణాలు కూడా డిజిటల్ మయం కానున్నాయని ఆయన తెలిపారు. దాదాపు సగం వాటా అలాంటి రుణాలే ఉండేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా రిటైల్, చిన్న తరహా సంస్థల కు బ్యాంకులు ఇకమీదట రుణాలు డిజిటల్ విధానంలోనే అందుబాటులోకి తేవచ్చు. ఈ విధానం ఇప్పటికే ఉన్నప్పటికీ పెద్దగా ప్రాచుర్యం జరగలేదని, ఇప్పుడిప్పుడే ఇది అందరికి తెలుస్తున్నందున వినియోగం కూడా రానురాను పెరిగిపోతుంది. ఆయా బ్యాంకులు ఆన్ లైన్ సేవలు అందించేందుకు తగు సాధనాలు పెంపొందించుకోవాల్సి ఉంటుంది.

ముఖ్యంగా రాబోయే రోజులలో ఎంఎస్ఎంఈ రుణాల విషయంలో ఈ దిశగా పెనుమార్పులు ఖచ్చితంగా వస్తాయని రాయ్ అంటున్నారు. గతంలో ఫైనాన్సియల్ టెక్నాలజీ వచ్చినప్పుడు అది బ్యాంకింగ్ రంగానికి పోటీగా ఉంటుందని అనుకున్నారు, కానీ ఇప్పుడు అవి సమన్వయంతో పనిచేయడం చూస్తున్నాం. పిన్టెక్ లు ప్రస్తుతం బ్యాంకులకు సహాయం చేస్తున్నాయి. కొత్తగా వచ్చే సాంకేతికతను బ్యాంకులు అందుబాటులోకి తెచ్చుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. దానికి తగ్గ నైపుణ్యం ఉన్న మానవవనరులు కూడా సమకూర్చుకోవాల్సిన అవసరం ప్రభుత్వ రంగ బ్యాంకులకు కూడా ఉందని రాయ్ అభిప్రాయపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: