నేటిరోజుల్లో సాధారణ జీవితం గడపడం కూడా కాస్త ఇబ్బందిగానే మారిపోయింది. ఎందుకంటే నిత్యవసరాలు సరుకుల ధరలు పెరిగిపోవడం.. మరోవైపు కూరగాయల ధరలు కూడా అమాంతం  పెరిగిపోవడం.. ఇంకోవైపు పెట్రోల్ ధరలు బాదుడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇక నిత్యవసరాలు అన్నీ కూడా సామాన్యుడికి భారంగానే మారిపోతున్నాయి. దీంతో సామాన్యుడి సంపాదన కనీసం కుటుంబ పోషణకు సరిపోని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. భర్త ఒక్కడే చేస్తే ఎలా ఇల్లు గడుస్తుంది అని భావిస్తూ ఇక భార్య కూడా భర్తకు చేదోడు వాదోడుగా ఉంటూ ఏదో ఒక పని చేస్తూ ఉండడం చూస్తూ ఉన్నాం.


 ఇక్కడ ఒక ఇల్లాలుకు ఇలాంటి పరిస్థితి ఎదురైంది. ఎన్నో ఆశలతో మెట్టినింట్లో అడుగు పెట్టింది. కానీ కొన్నాళ్ళకే ఆమెకు పరిస్థితి అర్థం అయింది. భర్త సంపాదన అంతంత మాత్రం కావడంతో ఇల్లు గడవడం కష్టంగా మారింది. కొన్నాళ్లు ఇబ్బంది పడిన ఆ మహిళ ఇక తాను కూడా సంపాదించాలని నిర్ణయించుకుంది. వినూత్నమైన ఆలోచన చేసింది. ఇక ఇప్పుడు ఉన్నత స్థానంలో ఉంది. జార్ఖండ్లోని తూర్పు సింగ్ భూమ్ జిల్లాకు చెందిన సవిత కు నాలుగేళ్ల క్రితం ప్రభాత్ తో వివాహం జరిగింది. అదే గ్రామంలో పిల్లలకు ట్యూషన్ చెబుతూ కుటుంబ పోషణ చూసుకునేవాడు. అయితే అలా వచ్చిన డబ్బులు కనీసం అవసరాలకు కూడా సరిపోయేవి కాదు.


 ఈ క్రమంలోనే భార్య సబితా కూడా సంపాదించాలని నిర్ణయం తీసుకొని రాధా-కృష్ణ మహిళ స్వయం సహాయక సంఘం లో చేరి కుట్టుమిషన్ కొనుక్కొని బట్టలు కుట్టడం ప్రారంభించింది. ఇక 2022లో సిసిఎల్ లోన్ కింద లక్ష రూపాయలు తీసుకొని మూరీల తయారీ యంత్రాన్ని కూడా కొనుగోలు చేసింది సవిత. ఆమె నిర్ణయమే జీవితాన్ని మార్చేసింది. ఇంట్లో మూరి తయారీ యంత్రం ఏర్పాటు చేసుకుని.. భర్తతో  పాటు కలిసి పనిచేస్తుంది. మూరీలను ఇంట్లోనే తయారు చేసి ప్యాక్ చేసి సమీప మార్కెట్లో విక్రయిస్తుండగా.. రోజుకు వెయ్యి రూపాయలపైగానే సంపాదిస్తుంది. దీంతో ఆమె కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. ఇక ఈ మహిళా మణి ప్రస్తుతం ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తూ ఉంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: