ఈ వ్యవసాయం ద్వారా లక్షలు సంపాదించవచ్చు ..?

దేశంలో రోజు రోజుకు నిరుద్యోగుల సంఖ్య బాగా పెరిగిపోతోంది. చాలా మంది యువకులు ఉద్యోగాలు లేక వ్యవసాయ రంగం వైపు మొగ్గు చూపుతున్నారు.వ్యవసాయంలో కొత్త మెలకువలు నేర్చుకుంటూ ఎక్కువ లాభాలను పొందుతున్నారు.వ్యవసాయం ద్వారా లక్షల రూపాయలు సంపాదిస్తున్న  బిజినెస్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఇక సాంప్రదాయ పంటలతో రైతులకు లాభాలు రావడం లేదని ఈ మధ్యకాలంలో రకరకాల పంటలను,కొత్త వ్యాపార పంటల రంగంలోకి అడుగు పెడుతున్నారు. ముఖ్యంగా తెలంగాణ లోని కరీంనగర్ లో కూరగాయల నారు పెంపకంలో పలువురు రాణిస్తూ ఎక్కువ ఆదాయాన్ని అందుకుంటున్నారు.. తిమ్మాపూర్ మండలంలో చాలా మంది యువ రైతులు నర్సరీలు పెంచుతూ చాలా లాభాలను అందుకుంటున్నారు. కూరగాయల సాగు చేయాలంటే రైతులు ముందుగా నారును రెడీ చేసుకోవాలి. 


గతంలో చాలామంది నారుమడులు వారి పొలంలోనే సిద్ధం చేసుకునేవారు.దీని వలన ప్రతికూల పరిస్థితులు ఏర్పడి నారుమడి సరిగ్గా వచ్చేది కాదు. కానీ ప్రస్తుతం నర్సరీలు వచ్చాక వీటన్నిటికీ ముగింపు పలికి నారు కోసం రైతులు నర్సరీలను సంప్రదిస్తున్నారు. ముఖ్యంగా ఎకరా పొలంలో నర్సరీ ఏర్పాటు చేసే దాదాపు 90 వేల దాకా ఖర్చు అవుతుంది.సీజన్ లో 1,50,000 నుంచి 2 లక్షల దాకా ఆదాయం సంపాదించవచ్చు.ఇందులో  50 వేల నుంచి లక్ష రూపాయలు దాకా లాభం వస్తుంది. ఇందులో ఎక్కువగా వంకాయ, టమాట, క్యాబేజి ఇంకా మిరపనారును బాగా పెంచుతున్నారు. కాలిఫ్లవర్, క్యాబేజీ ఇంకా టమాట మొలకెత్తడానికి మూడు నుంచి నాలుగు రోజుల సమయం పడితే, పొలంలో నాటేందుకు మొత్తం 15 రోజుల నుంచి 20 రోజుల సమయం పడుతుంది.ఇక మిరప, వంకాయ 25 రోజుల నుంచి 30 రోజుల సమయానికి పూర్తిస్థాయి అందుబాటులోకి వస్తాయి.ముఖ్యంగా కల్తీ విత్తనాల నుంచి రైతులు నష్టపోకుండా నర్సరీలు చాలా బాగా ఉపయోగపడుతున్నాయని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: