ప్రపంచ వ్యాప్తం గా అత్యంత డిమాండ్ కలిగిన వాటి లో బంగారం ఒకటి. ప్రపం చ వ్యాప్తంగా భారీ ఎత్తున అనేక దేశాలు బంగారం పై పెట్టు బడుల ను పెడుతూ ఉంటుంది . ఇక పోతే బంగారం కొనుగోలు లో మన ఇండియా అనేక దేశాల లో పోటీ పడుతూ ఉంటుంది . బంగారం ని కేవలం మన దేశ ప్రజలు పెట్టుబడిలా మాత్రమే కాకుండా సమాజం లో ఒక గుర్తింపు కోసం కూడా కొనుగోలు చేస్తూ ఉంటారు. మన దేశ ప్రజలు బంగారాన్ని ఆభరణాల మాదిరి చేయించు కొని ఒంటిపై ధరించడానికి ఎక్కువ శాతం ఇష్ట పడుతూ ఉంటారు. దానితో భారతీయులు ఎక్కువ బంగారాన్ని కొనుగోలు చేస్తూ ఉంటారు.

ఇకపోతే భారతదేశంలో ఎవరిదైనా వివాహం జరిగింది అంటే చాలు ఎంతో కొంత బంగారాన్ని కొనుగోలు చేయడం చేస్తూ ఉంటారు. అలాగే వివాహం జరిగిన సందర్భంలో వధువు , వరుడు కి బంగారు నగలను వేస్తూ ఉంటారు. దానితో వివాహాల సమయంలో కూడా బంగారం కొనుగోలు భారత దేశంలో ఎక్కువ జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం బంగారం ధరలు ఆల్ టైం హై కి చేరుకున్నాయి. ప్రస్తుతం బంగారం ధరలు 10 గ్రాములు ఒక లక్ష  పైన ఉంది. ఇక బంగారం ధరలు రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

మరి ప్రస్తుతం ఉన్న బంగారు ధరలను చూస్తూ ఉంటే సామాన్యులు బంగారం కొనాలి అనే ఆలోచనకు దూరంగా వెళ్లాల్సిన పరిస్థితులు కనబడుతున్నాయి. మరి బంగారం ధరలు ఇలానే పెరిగిపోతాయా  ..? లేక తగ్గుతాయా  ..? లేక ప్రస్తుతం ఉన్న స్థాయిలోనే మరి కొంత కాలం కొనసాగుతాయా  ..? అనేది చూడాలి. ఏదేమైనా ప్రస్తుతం మాత్రం బంగారం ధరలు ఆల్ టైం రికార్డు స్థాయిలో కొనసాగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: