హైదరాబాద్ ఒకప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రధాన కేంద్రంగా ఉండేది. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణకు రాజధానిగా మారింది. అలాంటి హైదరాబాద్ లో పేద మధ్యతరగతి నుంచి ఎంతోమంది ధనికులు కూడా జీవిస్తున్నారు. గ్రామాల్లో ఉపాధి లేకుంటే హైదరాబాద్ వెళ్లి బతికే మనుషులు ఎంతో మంది ఉన్నారు. చిన్న పెద్ద ధనికా బేధ ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని హైదరాబాద్ అక్కున చేర్చుకొని ఉపాధి కల్పిస్తోంది. అలా చిన్నాచితకా పనులు పనులు చేసుకుంటూ రూపాయి రూపాయి పోగేసి చాలామంది ఓ గుంట ఓ అర్ధగంట భూములు కొనుక్కున్నారు. కొంతమంది ఇండ్లు కూడా కట్టుకున్నారు. వీరికి రిజిస్ట్రేషన్ హైదరాబాద్ మున్సిపల్ పరిధి నుంచి  పర్మిషన్లు కూడా వచ్చాయి. కానీ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఈ భూములు గవర్నమెంట్ కు సంబంధించినవని చాలా వరకు ఈ భూములను లాక్కొని ఇండ్లను కూలగొట్టి ప్రభుత్వం బయటకు పంపేసింది. నిజానికి వీళ్లను మోసం చేసింది ప్రభుత్వం అయితే కాదు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు. 

హైడ్రా రాకముందు ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు  చాలావరకు చెరువులను,కుంటలను, ప్రభుత్వ భూములను ఆక్రమించి ప్రభుత్వ అధికారులకు లంచాలు ఇచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని నడిపించారు. ముఖ్యంగా వారిని తక్కువ ధరకే భూములు అంటూ ఆశ చూపి కొనేలా చేశారు. ఆ తర్వాత చేతులు దులుపుకొని వెళ్లిపోయారు. అలాంటి ఈ తరుణంలో హైదరాబాద్ వచ్చి పాత భూముల లిస్టు తీసి  చూస్తే చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములు అక్రమాలకు గురయ్యాని వాటన్నింటినీ మళ్లీ స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తుంది హైడ్రా.. ఇది ఎప్పుడైతే మొదలైందో అప్పటినుంచి హైదరాబాదులో రియల్ ఎస్టేట్ పడిపోయింది. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. మళ్లీ ఎలాగైనా రియల్ ఎస్టేట్ బూమ్ ప్రారంభం కావాలని అనేక ప్లాన్లు వేస్తున్నారు. తాజాగా రియల్ ఎస్టేట్లో ఒక బూమ్ తీసుకొచ్చారు.అది ఏంటో ఇప్పుడు చూద్దాం.. ఈ మధ్యకాలంలో హెచ్ఎండిఏ ఫ్లాట్ వేలం వేస్తే కొనేవాళ్లు కరువయ్యారు. 50వేలకు పాతికవేలకు గజం కూడా పోలేదు. ఇలాంటి ఈ తరుణంలో తాజాగా ఒక ఎకరం 150 కోట్లకు పైగా  ధర పలికింది.

 50 వేలకు 25వేల కు గజం కొనేవారు కరువైన ఈ సమయంలో 150 కోట్లకు ఇక్కడ భూమి వేలం ఎలా వచ్చింది అంటే అదొక కృత్రిమ రియల్ ఎస్టేట్ బూమ్ అని చెప్పవచ్చు. ఆ మధ్య కాలంలో కోకాపేటలో 100 కోట్లకు ఎకరమని ఒక కృత్రిమ బూమ్ సృష్టించి భూములన్ని అమ్మేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల కనుసన్నాల్లోనే ఇదంతా నడిచింది. 100 కోట్లకు కొన్నది ఏమీ లేదు కానీ ఒక భూమి సృష్టించి భూముల రేట్లు పెంచేసి పేదలను ముంచేశారు. అయితే హైదరాబాదులో రియల్ ఎస్టేట్ దెబ్బతిన్న ఈ తరుణంలో మళ్లీ ఒక బూమ్ సృష్టించి 150 కోట్లకు వేలం పాడారు.. కానీ దీన్ని ఎవరు కొంటారు కొనరు అనేది మనకు తెలియదు. కానీ భూమి ఏ ఏరియాలో ఉందో ఆ ఏరియాలో మళ్ళీ రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది పెరుగుతుంది. ఇలా కృత్రిమ బూమ్స్ సృష్టించి రియల్ ఎస్టేట్ వ్యాపారులు పేద,మధ్యతరగతి వారిని మోసం చేస్తున్నారని చెప్పవచ్చు. కాబట్టి భూములు కొనేముందు అది ఎలాంటిదని తెలుసుకొని కొనడం మంచిదని నిపుణులు  తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: