సండే వచ్చిందంటే చాలు ఇంట్లో ఎదో ఒక నాన్ వెజ్ కర్రీ వండి తీరాలిసిందే కదా. అయితే ఎప్పుడు వండేలాగా కాకుండా ఈసారి మటన్ వేపుడు వండి చూడండి. ఈ కర్రీ తినడానికి చాలా రుచికరంగా ఉంటుంది.అలాగే ఈ మటన్ ఫ్రై చాలా కారంగా ఘాటుగా కూడా  ఉంటుంది. కారం అంటే ఇష్టపడే వారికి మళ్ళీ మళ్ళీ తినేలా ఉంటుంది. అంతేకాకుండా ఇది కనీసం 2-3 రోజులు నిలవుంటుంది కూడా. ఇది పప్పుచారు లేదా చారు తో చాలా రుచిగా ఉంటుంది.వేపుళ్ళకి కండగల లేత ఎర్రని మాంసం అయితే బాగుంటుంది. మరి మటన్ ఫ్రై కి ఎలా చేయాలో చూద్దామా. !

కావాల్సిన పదార్ధాలు :

1/2 కిలో మటన్

1 tbsp అల్లం వెల్లులి పేస్టు

1 tbsp ధనియాల పొడి

2 tbsp కారం

ఉప్పు

3 tbsp నూనె

1 tsp పసుపు

వేపుడుకోసం

1/2 cup నూనె

1 tsp అల్లం వెల్లులి పేస్టు

2 రెబ్బలు కరివేపాకు

4 ఎండు మిర్చి

3 పచ్చిమిర్చి

1 tsp గరం మసాలా

2 tbsp కొత్తిమీర

1 tbsp కరివేపాకు

తయారీ విధానం:

ముందుగా ఒక గిన్నె తీసుకుని మటన్ ముక్కలు వేసి అందులో అన్ని ముందుగా సిద్ధం చేసుకుని ఉంచుకున్న మసాలాలు అన్నీ కలిపి కనీసం 3 గంటలు ఫ్రిజ్లో నాననివ్వండి. అవి నానిన తరువాత కుక్కర్ లో మటన్ ముక్కలు వేసి అందులో 300 ml నీళ్ళు పోసి మీడియం ఫ్లేం మీద 4 విసిల్స్ రానివ్వండి, 3 గంటలు నానినట్లితే 6-7 విసిల్స్ రానివ్వండి. మటన్ మెత్తగా ఉడికాక స్టవ్ వెలిగించి  అడుగు మందంగా ఉన్న మూకుడు పెట్టి అందులో నూనె వేడి చేసి కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసి వేపుకోండి.తరువాత అల్లం వెల్లులి ముద్ద వేసి వేపి, మెత్తగా ఉడికిన్చుకున్న మటన్ నీళ్ళతో సహా వేసి బాగా కలిపి మీడియం ఫ్లేం మీద కలుపుతూ హై- ఫ్లేమ్ మీద ముక్కలని వేగనివ్వండి. ముక్కలు 15 నిమిషాలకి వేగి నీరు ఇగిరిపోయి నూనె పైకి తేలుతుంది, అప్పుడు మరో సారి బాగా కలిపి గరం మసాలా వేసి ముక్కలు డ్రై గా  అయ్యేదాకా వేపుకోండి.దింపే ముందు కొత్తిమీర కరివేపాకు వేసి వేపి దిమ్పెసుకోండి

మరింత సమాచారం తెలుసుకోండి: