మహిళలు యువతులు చిన్నారులు తల్లి కడుపు నుంచి బయటకు వచ్చిన నుంచి అనుక్షణం భయపడుతూ బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. కారణం మొన్నటి వరకు మానవత్వం ఉన్న మనుషులు.. సాటి మనుషులకు సహాయం చేయాలనే మనసున్న మనుషులు... నేటి రోజుల్లో కామంతో ఊగిపోతూ మానవ మృగాలుగా  మారిపోతూ ఉండటమే. కనుచూపు మేరలో ఆడపిల్ల కనిపిస్తే చాలు దారుణంగా కామ వాంఛలు తీర్చుకునీ అత్యాచారాలు చేస్తున్న వారు ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇక ఇటీవల కాలంలో అయితే మరింత దారుణమైన ఘటన వెలుగులోకి వస్తున్నాయి. మొన్నటి వరకు పరాయి వ్యక్తుల నుంచి మాత్రమే ఆడ పిల్లలు లైంగిక వేధింపులు ఎదుర్కొనే వారు.


 కానీ ఇప్పుడు ఏకంగా సొంత ఇంటి వాళ్లనుంచి లైంగిక వేధింపులు ఎదురవుతున్నాయి. దీంతో తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ప్రతిక్షణం కుంగిపోతూ దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. ఇక్కడ సభ్య సమాజం తలదించుకునే ఘటన వెలుగులోకి వచ్చింది   ఏకంగా కూతురు నీ కంటికి రెప్పలా కాపాడుకుంటూ.. ఏ ప్రమాదం వచ్చినా రక్షించాల్సిన తండ్రి పదేళ్ళ కూతురు పాలిట పాపం గా మారిపోయాడు. అభం శుభం తెలియని పదేళ్ల కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.



 ఈ ఘటన గుజరాత్లోని సూరత్లో వెలుగులోకి వచ్చింది.. కాగా బాధిత బాలిక తన తల్లిదండ్రులకు ఇద్దరు తమ్ముళ్లతో ఉంటుంది. పని వెతుక్కుంటూ ఇటీవలే ఈ కుటుంబం సూరత్ కి వలస వచ్చింది. అయితే బాలిక తల్లి పనికి వెళ్లి ఇంటికి వచ్చేసరికి రక్తపు మడుగులో కూతురు కనిపించింది. దీంతో భయపడిపోయిన సదరు మహిళా వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. అయితే ఆమె ప్రైవేట్ పార్ట్ లో గాయాలతో ఇక రక్తపు మడుగులో బాలిక కనిపించడంతో శస్త్ర చికిత్స చేయించారు పోలీసులు. ఇక నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. సిసి టివి ఫుటేజ్ పరిశీలించి మామ తండ్రి ఇంటికి వచ్చినట్లు గుర్తించి వారిని అదుపులోకి తీసుకొని విచారించగా చివరికి తండ్రి నేరాన్ని అంగీకరించాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: