
అయితే నేటి రోజుల్లో వెలుగు లోకి వస్తున్న ఘటనలు చూస్తే జనాలు టెక్నాలజీని ఎలా వాడుకుంటున్నారు అన్నది పక్కన పెడితే.. సైబర్ నేరగాళ్లు మాత్రం ఇక అధునాతన టెక్నాలజీని అందరి కంటే ఎక్కువగా వాడేస్తున్నారని తెలుస్తుంది. తమలో ఉన్న టాలెంట్‌ను మంచి పనుల కోసం కాకుండా.. ఇక సైబర్ నేరాలు పాల్పడేందుకు ఉపయోగిస్తున్నారు. తద్వారా ఇక ఎంతో మంది అమాయకులను టార్గెట్ చేసుకొని లక్షలు కాజేస్తున్న ఘటనలు ఇటీవల కాలం లో కోకోళ్లలుగా వెలుగు లోకి వస్తూ ఉన్నాయి అని చెప్పాలి.
ఇక ఇటీవల సంగారెడ్డి జిల్లా లో కూడా ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఏకంగా వీఆర్ఏ ను బురిడీ కొట్టించిన సైబర్ నేరగాళ్లు 19 లక్షల రూపాయలు కాజేశారు. నాగలగిద్ద మండలంలో ముక్తాపూర్ లో వీఆర్ఏ గా పనిచేస్తున్నాడు పోశెట్టి రాజ్ కుమార్. ఇటీవలే అతని మొబైల్ కి ఒక గుర్తు తెలియని లింకు వచ్చింది. ఇక ఆ లింకు ఓపెన్ చేయగానే నిమిషాల వ్యవధిలో ఫైబర్ నేరగాళ్లు అతని ఖాతాలో ఉన్న 19.56 లక్షల రూపాయలు ఖాళీ చేశారు. దీంతో ఒక్కసారిగా షాక్ అయినా విఆర్ఏ రాజ్ కుమార్ లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి.