సాధారణంగా మధ్యతరగతి ప్రజలకు ఆర్టీసీ బస్సు ప్రయాణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు . ఎందుకంటే నేటి రోజుల్లో అయితే కొంతమంది మధ్యతరగతి ప్రజలు ఎక్కడికైనా వెళ్లాలి అంటే సొంత వాహనం కొనుగోలు చేసి వెళ్తున్నారు. కానీ ఒకప్పుడు మాత్రం ఆర్టీసీ బస్సు తప్ప వేరే మార్గం ఉండేది కాదు ఈ క్రమంలోనే ఎంతోమంది ఇక ఆర్టీసీ ప్రయాణాల ద్వారానే అన్ని కార్యక్రమాలకు కూడా హాజరయ్యేవారు అని చెప్పాలి   అయితే ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన అనుభవం ఉన్నవారికి లేదా ఇప్పటికీ కూడా ఇలా ప్రభుత్వ బస్సులో ప్రయాణిస్తున్న వారికి చిల్లర కష్టాలు ఏంటి అన్న విషయం అందరికీ తెలిసే ఉంటుంది.


 ఎవరైనా ఆర్టీసీ బస్సులో ఎక్కారు అంటే చాలు వారు తప్పకుండా వారి టికెట్ కు సరిపడా చిల్లర మెయింటైన్ చేయాల్సిందే లేదంటే ఊహించని ఇబ్బందులు వచ్చి పడుతూ ఉంటాయి అని చెప్పాలి. ఒకవేళ చిల్లర లేకపోతే ఇక అతను దిగే స్టాప్ దగ్గర ఇస్తాను అంటూ టికెట్ మీద రాస్తూ ఉంటాడు కండక్టర్. కొన్ని కొన్ని సార్లు ఇక చిల్లర విషయంలో మరొకరితో ముడిపెట్టడం లాంటివి కూడా ఎంతోమందికి అనుభవం ఉండే ఉంటుంది. ఇంకొన్నిసార్లు ఇక ఇవ్వాల్సిన చిల్లర ఇవ్వకుండా కండక్టర్ మర్చిపోవడం లాంటిది చేస్తూ ఉంటారు. ఇలాంటివి ఎప్పుడైనా జరిగితే పోనీలే అని అందరూ ఊరుకుంటారు.


 కానీ ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం అలా ఊరుకోలేదు. ఒక రూపాయి చిల్లర లేదు అని తిరిగి ఇవ్వకపోవడంతో ఈ విషయంపై ఏకంగా కోర్టు మెట్లు ఎక్కాడు సదరూ వ్యక్తి. చివరికి విజయం సాధించాడు. రమేష్ నాయక్ అనే వ్యక్తి 2019లో బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ బస్సులో ప్రయాణించాడు. అయితే టికెట్ ధర మిగిలిపోగా రూపాయి రావాల్సి ఉంది  కానీ కండక్టర్ తిరిగి ఇవ్వకుండా అతనిపై కోపడ్డాడు.. అయితే అధికారులకు చెప్పిన పట్టించుకోలేదు. దీంతో రమేష్ ఏకంగా కోర్టుకు వెళ్ళాడు. ఈ క్రమంలోనే 2000 జరిమానాతో పాటు ఇక ప్రయాణికుడి ఖర్చు కోసం వెయ్యి రూపాయలు ఇవ్వాలి అంటూ బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్నువ్వు కోర్టు ఆదేశించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: