
దీంతో ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు రోడ్డుపై వీధి కుక్కలు కనిపించాయి అంటే చాలు ఎక్కడ ప్రాణాలు తీస్తాయేమో అని ప్రాణభయంతో జనాలు పనికి పోతూ ఉన్నారు అని చెప్పాలి. అంతేకాదు ఇక నేటి రోజుల్లో వీధి కుక్కలు దాడులు చేస్తున్న ఘటనల గురించి తెలిసి ప్రతి ఒకరి వెన్నులో వణుకు పడుతుంది. అయితే వీధి కుక్కల కారణంగా ఎంత దారుణమైన ప్రమాదాలు జరుగుతున్నాయి అన్నదానికి ఇక్కడ వెలుగులోకి వచ్చిన రెండు వీడియోలు నిదర్శనంగా మారిపోయాయి. ఒక వ్యక్తి తన దారిలో తాను బైక్ పై వెళుతూ ఉన్నాడు. అలాంటి సమయంలో వీధి కుక్కలు అతన్ని వెంబడించి దాడి చేసేందుకు ప్రయత్నించాయి.
దీంతో ఒక్కసారిగా భయపడిపోయాడు. కుక్క ఎక్కడ తనపై దాడి చేస్తుందో అని కంగారుపడ్డాడు. ఇక బైక్ పై కంట్రోల్ కోల్పోయి కింద పడిపోయాడు. దీంతో తీవ్రంగా గాయపడి ప్రస్తుతం కోమలో ఉన్నాడు. ఈ ఘటన గుజరాత్ లోని వడోదరలో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. ఇక మరో ఘటనలో ఒక బాలుడు సైకిల్ తొక్కుకుంటూ తన దారిలో తాను వెళుతున్నాడు. అయితే రోడ్డు పక్కన ఉన్న వీధి కుక్కలు అతనిపై దాడి చేసేందుకు దూసుకు వచ్చాయి. దీంతో భయపడి పోయిన సదరుబాలుడు వేగంగా సైకిల్ తొక్కాడు. ముందు ఉన్న స్పీడ్ బ్రేకర్ చూసుకోలేదు. దీంతో ఒక్కసారిగా రోడ్డుపై కింద పడిపోయి తీవ్రంగా గాయపడి అచేతన స్థితిలోకి వెళ్లిపోయాడు. అతన్ని గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఈ వీడియోలు ట్విటర్లో వైరల్ గా మారాయి.