నేటి రోజుల్లో మానవ బంధాలకు అసలు విలువ లేకుండా పోయింది అన్న విషయం తెలిసిందే. ఏకంగా ఆస్తులు అంతస్తులకు విలువ ఇస్తున్న మనిషి ఇక సాటి మనుషులకు మాత్రం విలువ ఇవ్వకుండా ఎన్నో దారుణాలకు పాల్పడుతూ ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో ఆస్తులను దక్కించుకునేందుకు కనీ పెంచిన తల్లిదండ్రులను కూడా దారుణంగా హతమారుస్తున్న వారు కనిపిస్తూ ఉన్నారు. ఇక మరికొన్ని ఘటనలో ఏకంగా బతికున్న తల్లిదండ్రులను పేపర్లలో చంపేసి తప్పుడు పత్రాలు సృష్టించి ఆస్తిని కాజేస్తున్న వారు కూడా కనిపిస్తున్నారు అని చెప్పాలి.


 ఇలాంటి తరహా ఘటనలు ఇటీవల కాలంలో రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇక ఇలాంటివి చూసిన తర్వాత అటు మనిషి ఆలోచన తీరు ఎటు పోతుందో కూడా తెలియని విధంగా మారిపోయింది. ఇప్పుడే ఇలా ఉంటే.. ఇక భవిష్యత్తులో మనిషి ఇంకెలా ప్రవర్తిస్తాడో అని తలుచుకోవడానికే ప్రతి ఒక్కరికి కూడా భయమేస్తుంది అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగు చూసింది. ఏకంగా బతికుండగానే చనిపోయినట్లు నకిలీ పత్రాలు సృష్టించి భూమిని కాజేసేందుకు ప్రయత్నించారు కొంతమంది వ్యక్తులు. ఇక ఈ విషయాన్ని గుర్తించిన బాధిత కుటుంబం అధికారులకు ఫిర్యాదు చేసింది.


 మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం లో ఈ ఘటన వెలుగు లోకి వచ్చింది అని చెప్పాలి. మండలంలోని లింగారెడ్డి పేటకు చెందిన లలితకు గ్రామ శివారులో వ్యవసాయ భూమి ఉంది. అయితే కొందరు లలిత చనిపోయినట్లు తప్పుడు మరణ ధ్రువీకరణ పత్రాన్ని సృష్టించారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే పౌతీకి సైతం అప్లై చేశారు అక్రమార్కులు. ఈ క్రమంలోనే భూమి కాజేసేందుకు ప్రయత్నించారు. కానీ ముందుగానే ఈ విషయాన్ని గ్రహించిన బాధితురాలు.. వెంటనే కుటుంబ సభ్యులతో కలిసి ఎమ్మార్వో ఆఫీస్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఈ ఘటన కాస్తా స్థానికంగా సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: