
అమృత్ పాల్ సింగ్.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇతని పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఇతను ఒక ఖాలిస్తాన్ వేర్పాటువాదు. ఇక అతన్ని పట్టుకునేందుకు ప్రస్తుతం పంజాబ్ పోలీసులు అందరూ కూడా ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే సినిమా రేంజ్ లో ఏకంగా పోలీసులకే దశావతారం సినిమాను చూపిస్తున్నాడు అమృత్ పాల్ సింగ్. ఎందుకంటే ఎప్పటికప్పుడు వేషాలు మారుస్తూ తప్పించుకుంటున్నాడు అని చెప్పాలి. ఇక వేషధారణ మార్చుకుంటూ కార్ల నుంచి బైక్.. బైక్ నుంచి వివిధ వాహనాలు మార్చుకుంటూ పోలీసులకే మస్కా కొట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు అని చెప్పాలి. ఇప్పటివరకు ఏకంగా ఐదుకు ఫైగా వేషాలు మారుస్తూ బయట తిరిగినట్లు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా పోలీసులు గుర్తించారు.
ఇలా పోలీసుల నుంచి తప్పించుకునేందుకు అతను వేషాలు మారుస్తున్న తీరు చూసి పోలీసులు సైతం కంగు తిన్నారు అని చెప్పాలి. కాగా ప్రస్తుతం అతని కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే అతను మాత్రం పంజాబ్ దాటి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఒక కారులో టోల్గేట్ దాటిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. మెర్సడేస్ ఎస్ యు వి వాహనంలో అమృత్ పాల్ సింగ్ తప్పించుకున్నట్లు సీసీటీవీ ఫుటేజీలో తెలుస్తుంది. అంతేకాదు మారుతి సుజుకి బ్రీజా కారులో జలంధర్‌లోని టోల్గేట్ ను దాటుతున్న దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి.