రోజురోజుకు టెక్నాలజీలో ఎంతలా మార్పులు వస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇలా టెక్నాలజీలో వస్తున్న మార్పులు అటు మనిషి జీవన శైలిలో కూడా మార్పులు తీసుకువస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే సామాన్యుల నుంచి సంపన్నుల వరకు ప్రతి ఒక్కరికి టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో  ప్రతి ఒక్కరు కూడా ఈ టెక్నాలజీ పై కాస్త అతిగానే ఆధారపడుతూ ఉండటం కూడా చూస్తూ ఉన్నాం. అయితే ప్రస్తుతం టెక్నాలజీ వాడుకుంటూ ఎక్కడికైనా తెలియని ప్రదేశాలకు వెళ్లడం కూడా సులభంగా మారిపోయింది. గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసుకుంటే చాలు అందులో చూపించిన రూట్ లో వెళ్లి ఇక కావాల్సిన గమ్యస్థానాలకు చేరుకోగలుగుతున్నారు అందరూ.


 దీంతో ఇటీవల కాలంలో గూగుల్ మ్యాప్ వాడకం కూడా విపరీతంగా పెరిగిపోయింది. ఇలా తెలియని ప్రదేశాలకు వెళ్లాలన్న ఎవరు కూడా ఇబ్బంది పడటం లేదు. గూగుల్ మ్యాప్ ను ఆశ్రయిస్తూ ఎంతో సులభమైన ప్రయాణాన్ని సాగిస్తున్నారు. కానీ గూగుల్ మ్యాప్స్ పై కాస్త అతిగా ఆధారపడితే మాత్రం ప్రమాదం తప్పదు అనే నిరూపించ ఘటనలు కూడా చాలానే వెలుగులోకి వస్తున్నాయని చెప్పాలి. ఇటీవల ఏపీలోని కృష్ణాజిల్లాలో ఇలాంటి తరహా ఘటన జరిగింది. ఏకంగా గూగుల్ మ్యాప్ ను నమ్ముకుంటే చివరికి ప్రాణం పోయింది.  ఈ ఘటన కాస్త స్థానికంగా సంచలనగా మారిపోయింది.



 కృష్ణాజిల్లాకు చెందిన చరణ్ అనే 22 ఏళ్ళ యువకుడు హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అయితే ఇటీవలే రాత్రి తన స్నేహితులతో కలిసి బైకులపై కేబుల్ బ్రిడ్జి వైపు బయలుదేరాడు. ఈ క్రమంలోనే గూగుల్ మ్యాప్ చూస్తూ ఆరాంఘర్ వద్ద దారి తప్పాడు. అయితే వెంటనే గ్రహించిన చరణ్ ఇక పిల్లర్ నెంబర్ 82 వద్ద ఎక్స్ప్రెస్ వే నుంచి కిందకు వెళుతుండగా వేగంగా దూసుకు వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో చరణ్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. చివరికి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ అతడు ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఇలా గూగుల్ మ్యాప్ సరైన రూట్ చూపించకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదం జరిగిందని స్నేహితులు చెబుతూ ఉండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: