కావాల్సిన ప‌దార్థాలు:
 తెల్ల బఠాణీ- ఒక కప్పు
పసుపు- ఒక‌ టీ స్పూను
ఉప్పు- రుచికి స‌రిప‌డా

 

కొత్తిమీర తరుగు- కొద్దిగా
చాట్‌ మసాలా- ఒక టీ స్పూన్‌
నిమ్మ రసం- ఒక టీ స్పూన్‌

 

టొమాటో పేస్ట్‌- పావు కప్పు
కారం- ఒక టీ స్పూను
కార్న్‌ ఫ్లేక్స్‌- తగినన్ని
ధనియాల పొడి- ఒక టీ స్పూన్‌

 

ఉల్లిపాయ‌ పేస్ట్‌- మూడుటేబుల్‌ స్పూన్లు
అల్లం వెల్లుల్లి పేస్ట్‌- ఒక టీ స్పూన్‌
జీలకర్ర పొడి- ఒక టీ స్పూన్‌

 

త‌యారీ విధానం: బఠాణీలను ఒక రోజు ముందుగానే నానబెట్టుకుని ఉంచుకోవాలి. మ‌రుసటి రోజు ఉదయం, కుకర్‌లో బఠాణీలు, పసుపు, ఉప్పు, తగినన్ని నీళ్లు, ఒక టీ స్పూను నూనె జత చేసి స్టౌ మీద ఉంచి సన్న మంట మీద మూడు విజిల్స్‌ వచ్చాక దించేయాలి. అవి చ‌ల్లారాక సగం బఠాణీలను మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్‌ చేయాలి. ఇప్పుడు స్టౌ మీద పాన్‌లో రెండు టేబుల్‌ స్పూన్ల నూనె వేసి కాగాక, ఉల్లి పేస్ట్‌ వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి.

 

ఆత‌ర్వాత‌ అల్లం వెల్లుల్లి పేస్ట్‌, టొమాటో పేస్ట్ వేసి కొద్దిసేపు వేయించాక, బఠాణీ పేస్ట్, ఉడికించిన బఠాణీలు జత చేయాలి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు, మిరప కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చాట్‌ మసాలా మ‌రియు త‌గిన‌న్ని నీళ్లు పోసి కొద్దిసేపు ఉడికించుకోవాలి. నీళ్లు ఇగిరిపోయాక కొత్తిమీర, నిమ్మ‌ర‌సం చ‌ల్లి స్టై ఆఫ్ చేస్తే స‌రిపోతుంది. అంతే వేడి వేడి బఠాణీ చాట్ రెడీ..!
 

మరింత సమాచారం తెలుసుకోండి: