కావాల్సిన ప‌దార్థాలు:
పాలు- నాలుగు కప్పులు
ద్రాక్ష పండ్లు- ఒక‌ కప్పు
మామిడిపండు ముక్క‌లు- ఒక‌ కప్పు

 

యాపిల్ ముక్క‌లు- ఒక‌‌ కప్పు
షుగర్- ఐదు టేబుల్ స్పూన్లు
కస్టర్డ్ పౌడర్- మూడు టేబుల్ స్పూన్లు

 

సపోటా ముక్కులు- అర‌ కప్పు
దానిమ్మ గింజలు- ఒక‌ కప్పు
బాదంప‌ప్పు- ప‌ది
జీడిప‌ప్పు- ప‌ది

 

త‌యారీ విధానం: ముందుగా మూడు కప్పుల పాలలో షుగర్ వెసి మీడియం మంట‌పై పెట్టి బాగా క‌లుపుతూ మ‌రిగించండి. మిగతా ఒక‌ కప్పు పాలలో కస్టర్డ్ పౌడర్ వేసి బాగా కలిపి మరుగుతున్న పాలల్లో పోసి బాగా కలపండి. ఐదు నిమిషాలు ఉడికించిన తర్వాత పాలు చిక్కగా అవుతాయి. అప్పుడు పాల మిశ్రమాన్ని స్టవ్ మీద నుంచీ దించేసి ఆరిన తర్వాత ఫ్రిజ్‌లో పెట్టండి.

IHG

ఒక అర గంట పాటు కూల్‌ అవ్వనివ్వండి. ఈ లోగా ఫ్రూట్స్ కట్ చేసి పెట్టుకోండి. అర గంట‌ తర్వాత పాలను ఫ్రిజ్ లోంచీ బయటకు తీసి కట్ చేసిన ఫ్రూట్స్‌ని అందులో వేసి కలిపి మళ్లీ ఫ్రిజ్‌లో పెట్టి ఓ గంట ఉంచి తర్వాత బయటకు తీసి బాదం, జీడిపప్పు జ‌ల్లుకోవాలి. అంతే ఎంతో సులువైన‌, రుచిక‌ర‌మైన కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ రెడీ.

IHG

ఈ కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్‌ని వేస‌వి తిన‌డం వ‌ల్ల శ‌రీరం త్వ‌ర‌గా కూల్ అవుతుంది. మ‌రియు మైడ్ రిఫ్రెష్ అవుతుంది. పిల్ల‌లు కూడా దీన్ని ఎంతో ఇష్టంగా తింటారు. కాబ‌ట్టి, ఈ లాక్‌డౌన్ అండ్ స‌మ్మ‌ర్ టైమ్‌లో ఖ‌చ్చితంగా కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ త‌యారు చేసుకుని ఎంజాయ్ చేయాల్సిందే. ఇంకెందుకు ఆల‌స్యం పైన చిప్పిన టిప్స్ పాలో అవుతూ కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ రెడీ చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: