ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...పులావ్ ఎంత రుచికరమైన వంటకమో అందరికి తెలుసు. ఇది మన దేశ సాంప్రదాయ వంటకం... ఇది అంటే అందరికీ ఇష్టమే..పులావ్ లో చాలా రకాలు ఉంటాయి. ఇక చిక్కుడు గింజల పులావ్ అయితే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇక  ఎంతో రుచికరంగా ఉండే ఈ రెసిపీకి కాస్తా హెల్త్‌ని కూడా యాడ్ చేస్తే ఇంకా బావుంటుంది. అందుకే.. ఈ సారి ఈ పులావ్ ని  చిక్కుడు గింజలతో చేద్దాం.. అదే చిక్కుడు గింజల పులావ్.. మరి ఈ చిక్కుడు గింజల పులావ్ కి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం ఏంటో ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ లో చదవండి.మీరు ఇంట్లో ట్రై చెయ్యండి...


కావాల్సిన పదార్ధాలు....

250 -గ్రాములు ఉడకబెట్టడం బియ్యం
1 -కప్ ఉడకబెట్టడం ఫీల్డ్ పీ
1 -కప్ రీఫైండ్ ఆయిల్ లేదా సుద్దిచేసిన నూనె
1 -టీ స్పూన్ కసూరి మేతి పౌడర్
1 -కప్ తురిమిన టెంకాయ
1 -చేతి నిండా కోయబడినవి కొత్తిమీర
1 -టీ స్పూన్ ఆవాల విత్తనాలు
1 -టీ స్పూన్ సెనగ పప్పు
1 -టీ స్పూన్ మినపప్పు
1 -చిటికెడు పసుపు
5 -కత్తిరించి రెండుముక్కలుగా కోసినవి ఆకుపచ్చని పచ్చిమిరప కాయలు
అవసరాన్ని బట్టి కరివేపాకు...

తయారు చేసే విధానం....

చిక్కుడు గింజల పులావ్ తయారికి ముందుగా ఓ పాన్ తీసుకుని అందులో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేగాక అందులో ఆవాలు, శనగపప్పు, మినపప్పు వేసి వేయించాలి.ఆ పోపు మిశ్రమంలోనే పసుపు, పచ్చి మిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. ఇప్పుడు అందులో ఉడికించిన చిక్కుడు గింజలు వేసి బాగా కలపాలి. అందులోనే తరిగిన కొత్తిమీర వేసి బాగా కలపాలి.ఇప్పుడు ఈ పోపు మిశ్రమంలోనే ఉడికించిన అన్నం వేసి కలపాలి. తర్వాత అందులో మెంతి పొడి, ఉప్పు వేసి మరోసారి పదార్థాలన్నీ కలిసిపోయేలా కలపండి.చివరిగా కొబ్బరి తురుము వేసి కలపండి. అంతే టేస్టీగా ఉండే చిక్కుడు గింజల పులావ్ సిద్ధమైనట్టే...ఇలాంటి మరెన్నో గుమ గుమ లాడే వంటకాల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి.. ఇంకా మరెన్నో గుమ గుమ లాడే వంటకాలు ఎలా తయారు చెయ్యాలో తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: