ఇటీవ‌ల కాలంలో కొందరు చిన్నచిన్న కారణాల వల్ల వైవాహిక సంబంధాలను నాశనం చేసుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే లీగల్ గా భార్యాభర్తలు విడిపోవడం, తమ వైవాహక జీవితానికి శుభం కార్డ్ పలడానికి డైవర్స్ ని ఎంచుకుంటారు. అయితే భార్యాభర్తల్లో ఎవరైనా సరే తామే ఆధిపత్యం చెలాయించాలనుకోవడం, తమదే పై చేయి కావాలనుకోవడం వల్ల ఇలాంటి సమస్యలు ఏర్పడుతుంటాయి. ఇవి చివ‌ర‌కు జీవితాల‌నే నాశ‌నం చేస్తాయి. ఇదిలా ఉంటే.. తాజాగా వేలూరు సమీపంలోని మేట్టు ఇడయాంబట్టి గ్రామంలోని ఎంజీఆర్‌ నగర్‌కు చెందిన రామచంద్రన్‌కు.. 19 ఏళ్ల క్రితం కమలి అనే యువ‌తితో వివాహం జ‌రిగింది.

 

వీళ్ల‌కు ఇద్ద‌రు పిల్లలు కూడా ఉన్నారు. ఇక రామచంద్రన్ తొర్రపాడిలో టైలర్‌ దుకాణం నడుపుతూ కుటుంబాన్ని పోషించేవారు. అయితే అనివార్య కారణాల వల్ల రామచంద్రన్, కమలి గ‌త ఐదేళ్లుగా విడివిడిగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో కరూర్‌కు చెందిన ఒక యువతి తొర్రపాడిలోని బందువుల ఇంటికి వచ్చిన టైమ్‌లో రామచంద్రన్‌తో పరిచయం ఏర్ప‌డింది. ఆ ప‌రిచ‌యాన్ని కాస్త రామ‌చంద్ర‌న్‌ పెళ్లిదాకా తీసుకువెళ్లాడు. కానీ, రామ‌చంద్ర‌న్ త‌న మొద‌టి పెళ్లి గురించి స‌ద‌రు అమ్మాయికి, వారి కుటుంబ స‌భ్యుల‌కు చెప్ప‌కుండా దాచేశాడు.

 

ఈ విష‌యం తెలియ‌కుండా బుధవారం ఉదయం అడుక్కంబరైలోని అమ్మన్‌ ఆలయంలో వీరిద్ద‌రికీ పెళ్లి చేయ‌డానికి కుటుంబ స‌భ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ క్ర‌మంలోనే పూజలు పూర్తి చేసుకొని తాళి కట్టేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. అయితే ఈ విష‌యం తెలుసుకున్న రామ‌చంద్ర‌న్ మొద‌టి భార్య క‌మ‌లి త‌న ఇద్ద‌రి పిల్ల‌ల‌తో అక్క‌డ‌కు వ‌చ్చి పెళ్లి దుస్తులతో ఉన్న భ‌ర్త‌ను నిల‌దీసింది. దీంతో పెళ్లి కుమార్తె బంధువులు, కమలి మధ్య ఘర్షణ వాతావారణం నెలకొంది. ఇక ఈ విష‌యం తెలుసుకున్న పోలీసులు అక్క‌డ‌కు వ‌చ్చి.. అంద‌రినీ పోలీస్ స్టేషన్ కు త‌ర‌లిస్తుండ‌గా.. రామ‌చంద్ర‌న్‌కు స‌డెన్ గుండెపోటు వ‌చ్చింది. దీంతో వెంట‌నే అత‌న్ని హాస్ప‌ట‌ల్‌కు త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. ప్ర‌స్తుతం పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.

  
  
  

మరింత సమాచారం తెలుసుకోండి: